India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మెహతాబ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఈయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణం చేయిస్తారు. 1998లో తొలిసారి ఒడిశాలోని కటక్ ఎంపీగా BJD తరఫున తొలిసారి ఈయన గెలిచారు. తర్వాత వరుసగా 1999, 2004, 09, 14, 19లో విజయం సాధించారు. ఈ ఏడాది బీజేపీలో చేరి విజయ ఢంకా మోగించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన తిహార్ జైలు నుంచి రేపు(శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్‌లో ఆయన లంచం తీసుకున్నారని ఈడీ కేజ్రీవాల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలను చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. కొందరు భర్తలను కోల్పోతే మరికొందరు తమ తండ్రులు, సోదరులను పోగొట్టుకున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులు శిలువ పట్టుకొని వారి తండ్రుల అంత్యక్రియలకు వెళ్తూ కనిపించిన దృశ్యం కన్నీరు తెప్పిస్తోంది. పదుల సంఖ్యలో మృతదేహాలను ఒకేచోట దహనం చేశారు. ప్రస్తుతం 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘KGF 1’ మూవీ రేపు రీరిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.
TG: తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రొ. జయశంకర్ నిలిచిపోయారని సీఎం రేవంత్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా రేవంత్ నివాళులర్పించారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడని, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి జాగృతం చేశారని తెలిపారు. తుదిశ్వాస వరకు ఆయన తెలంగాణ కోసం పరితపించారని రేవంత్ కొనియాడారు.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇండియా: రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫరూఖీ.
తెలంగాణకు హోం మంత్రే కాదు విద్యాశాఖ మంత్రి కూడా లేరని Xలో BRS సెటైరికల్ ప్రకటన జారీ చేసింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 200 రోజులు అవుతున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ విద్యాలయాల అవసరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. అందుకే వెంటనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను’ అని ట్వీట్ చేసింది.
వందేభారత్ ట్రైన్‌లో భోపాల్ నుంచి ఆగ్రాకు వెళుతున్న ఓ జంటకు మీల్స్‌లో బొద్దింక వచ్చింది. దీంతో విదిత్ అనే యువకుడు విషయాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆంటీ-అంకుల్ ఆర్డర్ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని Xలో కోరారు. స్పందించిన రైల్వేశాఖ క్షమాపణలు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇండియా కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ నాయకునికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని NCP-SP చీఫ్ శరద్ పవార్ చెప్పారు. ఆ మేరకు 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీనే విపక్ష నేతను నిర్ణయిస్తుందన్నారు. ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, అందుకే సీట్లు భారీగా తగ్గిపోయాయని చెప్పారు. కాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును CWC ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.