India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఐదుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం హస్తం పార్టీ బలం 70కి చేరింది. తెల్లం వెంకటరావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల) పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, BRS 39 సీట్లు సాధించాయి. ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవడంతో దాని బలం 70కి పెరిగింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ చీఫ్ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారు. ఈనెల 27తో టీపీసీసీ చీఫ్‌గా ఆయన పదవీకాలం ముగియనుంది.
NDA ప్రభుత్వం లోక్‌సభకు స్పీకర్ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరిని నియమించడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబడుతోంది. సాధారణంగా ఎక్కువసార్లు సభకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. అయితే భర్తృహరి ఏడుసార్లు MPగా గెలవగా కాంగ్రెస్ నుంచి కొడికున్నిల్ సురేశ్ 8వసారి MP అయ్యారు. ఈ కారణంగానే NDA ప్రభుత్వం సభా సంస్కృతిని పాటించడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
T20WC సూపర్8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిచింది. DLS పద్ధతిలో 17 ఓవర్లలో టార్గెట్ 123 రన్స్ చేయాల్సి ఉండగా 16.1ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 6 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. రెండు గ్రూపుల నుంచి రెండేసీ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉండటంతో గ్రూప్2 నుంచి నిన్న ఇంగ్లండ్(4), తాజాగా సౌతాఫ్రికా సెమీస్‌లో బెర్తు ఖరారు చేసుకున్నాయి. వెస్టిండీస్(2), USA(0) ఇంటిముఖం పట్టాయి.
అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సీ టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండేలా తయారు చేయాలంది. ఇప్పటికే యురోపియన్ యూనియన్‌లో ఈ రూల్ అమలవుతోంది. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లకూ ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీలు, ఐదు సంతకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌కు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
AP: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు టీటీడీ ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. దీని ద్వారా తిరుపతి, తిరుమలలో గదులు బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి చూస్తున్నారు. శ్రీవారిని నిన్న 81,455మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,251మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ3.67కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
T20WCలో భాగంగా వెస్టిండీస్VSసౌతాఫ్రికా సూపర్8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. DLS ప్రకారం సౌతాఫ్రికా టార్గెట్ 123 రన్స్‌గా మారింది. విండీస్ బౌలర్లలో ఇద్దరు 4 ఓవర్లు, ముగ్గురు 3 ఓవర్ల చొప్పున వేసుకోవచ్చు. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 135/8 చేయగా ఛేదనలో సౌతాఫ్రికా 2 ఓవర్లు ముగిసేసరికి 15/2 చేసింది.
AP: పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచిరోజులొస్తాయని వారితో అన్నారు. ‘నేను మళ్లీ ప్రజల్లోకి వస్తా. అందరికీ అండగా ఉంటా. రాబోయే రోజులు మనవే’ అని భరోసా ఇచ్చారు. కాగా.. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.