India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘దేశానికి జాతి పితలు లేరు. పుత్రులే ఉన్నారు. ఈ భారతమాత పుత్రులు ధన్యులు’ అంటూ EX PM లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పిస్తూ BJP MP కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే, గాంధీ, శాస్త్రిల మధ్య వ్యత్యాసం చూపుతూ, బాపూను తక్కువ చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ‘గాడ్సే కొత్త భక్తురాలు’ అంటూ కంగనాను కాంగ్రెస్ విమర్శించింది. జాతిపిత ఉన్నారు, పుత్రులు ఉన్నారు, అమరవీరులూ ఉన్నారు అని పేర్కొంది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉ.10.30 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.77,560కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.100 పెరిగి రూ.71,100గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.1,01,000గా కొనసాగుతోంది.
TG: కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపు నింపుతున్నారు. మహబూబ్‌నగర్(D) మాసన్‌పల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఓ కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో HYD రాజేంద్రనగర్‌లో ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తామని పోలీసులు తెలిపారు.
మణిపూర్‌లో 17నెలల తర్వాత కుకీ, మైతేయి తెగల వ్యక్తులు కౌగిలించుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. Sep 27న గూగుల్ మ్యాప్స్‌ని నమ్మి మైతేయి వ్యక్తులు కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించి, బందీలయ్యారు. ప్రభుత్వ జోక్యంతో కుకీ సివిల్ సొసైటీ వారిని విడుదల చేసింది. వారిని సొంత తెగకు అప్పగించే క్రమంలో వారు హగ్ చేసుకున్న ఫొటో వైరలవుతోంది. ఈ తెగల మధ్య విబేధాలతో మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు-3’ సినిమాపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ‘భారతీయుడు-2’ ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ‘ఇండియన్-3’ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు తెలిపాయి. OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నాయి.
సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైజయంతి మూవీస్ స్పందించింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం. జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించం. మా పరిశ్రమను, దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కలిసి నిలబడతాం’ అని ట్వీట్ చేసింది.
AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.
AAP కన్వీనర్, ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని రేపు ఖాళీ చేస్తారని పార్టీ వెల్లడించింది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఉన్న ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నట్లు తెలిపింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
TG: మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు. ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకుముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు.
Sorry, no posts matched your criteria.