News October 3, 2024

DANGER: కేక్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

బేకరీల్లో దొరికే కేకులు తినేవారికి షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని బేకరీల్లో దొరికే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో క్యాన్సర్ కారకాలున్నట్లు పరీక్షల్లో తేలింది. బేకరీల్లో నుంచి సేకరించిన 235 కేక్‌ల నమూనాలను పరీక్షించారు. ఇందులో 12 విభిన్న రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. కేకుల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్‌తో పాటు శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని వెల్లడైంది.

News October 3, 2024

ఈ బ్యాగు ధర ఇంటి కన్నా ఎక్కువే.. తెలుసా!

image

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను సేకరించడంలో నటాషా పూనావాలా ముందుంటారు. రీసెంటుగా పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆమె మోనోగ్రామ్ డ్రెస్‌లో మెరిశారు. ఇక ఆమె పట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్ అందర్నీ ఆకర్షించింది. అదే Louis Vuitton Maison de Famille బ్యాగ్. ఇంటిని తలపించే ఈ బ్యాగ్ ధర రూ.38 లక్షలు. పారిస్‌ శివారులోని Maison d’Asnieresకి ఇది మినియేచర్ వెర్షన్. ఈ ఇంటికి చాలా లెగసీ ఉందని తెలిసింది.

News October 3, 2024

కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

image

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

News October 3, 2024

సురేఖ చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మహేశ్

image

సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో మహేశ్‌బాబు స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్‌గా అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

గూఢచారులు కావలెను: యూఎస్ ఓపెన్ ఆఫర్

image

చైనా, నార్త్ కొరియా, ఇరాన్‌లో తమకు గూఢచారులు కావాలని అమెరికా బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఫేస్‌బుక్, X, యూట్యూబ్, ఇన్‌స్టా అన్నింట్లో CIA పోస్టులు పెట్టింది. తమను ఎలా రహస్యంగా సంప్రదించాలో కూడా తెలిపింది. వీపీఎన్ లేదా టోర్ నెట్‌వర్క్ ఆధారంగా తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఆయా దేశాల వీపీఎన్‌లు వాడొద్దని పేర్కొంది. కాగా చైనా, నార్త్ కొరియా, ఇరాన్‌ యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లను నిషేధించాయి.

News October 3, 2024

లవ్ జిహాద్ జాతి ఐక్యతకు బిగ్ థ్రెట్: UP కోర్టు

image

భారత్‌పై ఓ వర్గపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆధిపత్యమే ‘లవ్ జిహాద్’ లక్ష్యమని UPలోని ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పేర్కొంది. దీనిని ప్రేమ పేరుతో అక్రమంగా మతం మార్చడం, పాక్, బంగ్లా పరిస్థితుల్ని కల్పించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రగా వర్ణించింది. జదావున్‌పూర్‌లో Md అలీమ్ తన ఐడెంటిటీ దాచి ఆనంద్ పేరుతో ఓ స్టూడెంట్‌ను రేప్ చేసి చంపేస్తానని బెదిరించాడు. కోర్టు అతడికి జీవితఖైదు విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

News October 3, 2024

కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్

image

మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, BRS రాజకీయాలు చేస్తున్నాయని CM రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. ఫాంహౌస్‌లు కూల్చుతామనే భయంతో పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.

News October 3, 2024

ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి

image

TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.

News October 3, 2024

సద్గురుకు రిలీఫ్: TN పోలీస్ యాక్షన్ అడ్డుకున్న సుప్రీంకోర్టు

image

మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌పై TN పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది. HCPని హైకోర్టు నుంచి బదిలీ చేసుకుంది. చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను OCT 18కి వాయిదా వేసింది. 5వేల మంది ఉండే ఆశ్రమంలోకి 150+ పోలీసులు వెళ్లారని ఈషా లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ‘అవును, అలాంటి చోటకు అలా వెళ్లకూడదు’ అని CJI ఏకీభవించారు.

News October 3, 2024

మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM

image

TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్‌లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.