India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయంపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిని ప్రధాని మోదీ ఖండించారు. అలాగే దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలు గర్హనీయమని పేర్కొంటూ Xలో పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఎన్నటికీ బలహీనపరచలేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం జరిగేలా కెనడా ప్రభుత్వం చట్టాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
TG: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు.
AP: హోంమంత్రి ఫెయిల్ అయ్యారని తామంటే ఎగిరిపడ్డ అనిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏం చెబుతారని YCP నేత రోజా ప్రశ్నించారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాలను నియంత్రించలేకపోతున్న CM చంద్రబాబును కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని ఆమె విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీని ఖరారు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. మొదటి విడతలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. రెండో విడత నుంచి కార్డు ఉంటేనే అర్హులు అవుతారని తెలిపారు.
AP: రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై స్పందిస్తూ తాను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘హోం మినిస్ట్రీ తీసుకుని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
చెన్నై మెట్రో రెండో దశ పనులకు 40% లేబర్ షార్టేజ్ సౌత్ స్టేట్స్‌ను ఇబ్బంది పెడుతోంది. లోక్‌సభ పోలింగ్ కోసం ఝార్ఖండ్, బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినవాళ్లు మళ్లీ తిరిగి రావడం లేదు. మెట్రో, రోడ్లు, ఇన్ఫ్రా ప్రాజెక్టులతో UP సహా నార్త్‌లోనే వారికి చేతినిండా పని దొరుకుతోంది. ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. పైగా వారిపై వెగటు వ్యాఖ్యలూ ప్రభావం చూపాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మీ కామెంట్.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటలే గడువు ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందస్తు పోల్ సర్వేలు కమల, ట్రంప్ మధ్య హోరాహోరీ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. అయితే బెట్టింగ్ మార్కెట్‌లో మాత్రం ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్రతి వేదిక ట్రంప్ అనూహ్య విజయాన్ని అంచనా వేస్తున్నాయి. BetOnline, Betfair, Bovada, PolyMarket వేదికలపై ట్రంప్ 50%పైగా విజయావకాశాలతో ముందున్నారు.
AP: అవసరమైతే తాను హోంమంత్రి పదవి చేపడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి నారాయణ స్పందించారు. ఏ శాఖపైనైనా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించే అధికారం ఉంటుందని మంత్రి అన్నారు. పవన్ వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్నచిన్న సమస్యలుంటే సీఎం సమన్వయం చేస్తారని నారాయణ అన్నారు.
AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. దీంతో ఒక్కో యూనిట్‌కు 0.40 పైసలు సర్దుబాటు ఛార్జీలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ఈ ట్రూఅప్ ఛార్జీలపై ఈ నెల 19లోగా అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలంది.
Sorry, no posts matched your criteria.