India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్‌కు XY క్రోమోజోమ్‌లు, అంతర్గత వృషణాలు ఉన్నట్లు ఇటీవల లీకైన వైద్య నివేదిక ద్వారా తెలుస్తోంది. సహజంగా XY క్రోమోజోమ్‌లు పురుషుల్లో ఉంటాయి. ఖెలీఫ్‌ను మహిళల విభాగంలో అనుమతించడం గతంలో తీవ్ర వివాదం రేపింది. ఖెలీఫ్‌కు ఇచ్చిన స్వర్ణాన్ని వెనక్కి తీసుకోవాలని ICONS కో ఫౌండర్ మార్షీ స్మిత్ డిమాండ్ చేశారు.
రైల్వే సేవల్ని పొందడానికి నాలుగైదు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్‌లో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం రైల్వే ‘సూపర్ యాప్’ను తీసుకురానుంది. దీని ద్వారా టికెట్ బుకింగ్ మొదలుకొని, ఫుడ్ ఆర్డర్, సర్వీస్ ట్రాకింగ్, ఫిర్యాదులు వంటి అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ సూపర్ యాప్ IRCTCతో సమాంతరంగా పనిచేస్తుంది.
AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ GOVT నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. APని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు.
రోడ్లపై వడ్ల కుప్పలతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తోంది. అక్కడ స్థలం సరిపోక చాలా మంది రైతులు రోడ్లపై వడ్లను ఆరబోస్తున్నారు. రాత్రి వేళ కుప్పలు, రాళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సగం రోడ్డుపైనే వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవట్లేదు.
మన దగ్గర సర్పంచ్, ఎమ్మెల్యే ఎలక్షన్లకే జోరుగా బెట్టింగ్ జరుగుతుంటుంది. అలాంటిది ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను వదిలేస్తారా? సర్వేలను నమ్మి మిలియన్ డాలర్లను బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌పోస్ట్ అమెరికా ప్రకారం US ప్రెసిడెన్షియల్ ఎన్నికలపై కొన్ని చట్టపరమైన ప్లాట్‌ఫామ్‌లలో $100M (రూ.830 కోట్లు) పైగా పందెం వేసినట్లు పేర్కొంది. అనధికారికంగా ఇంకెంత జరిగి ఉంటుందో?
తెలంగాణలో సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసానిచ్చారు. సర్పంచుల బకాయిలను మార్చిలోగా చెల్లిస్తామన్నారు. రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. గతంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన BRS, నేడు ధర్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. TGకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం కలిగితే, కేంద్రం రూ.400 కోట్లే ఇచ్చిందని ఫైర్ అయ్యారు.
రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత జట్టులో కేవలం రిషభ్ పంత్ మాత్రమే అందుకు గట్టి పోటీదారు. కెప్టెన్సీకి అతడు న్యాయం చేయగలడు. అతడు ఏ స్థానంలో వచ్చినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ భయపడింది’ అని వ్యాఖ్యానించారు.
నేరవార్తల్లో పంచనామా పదం చదివే ఉంటాం. ఘటనాస్థలికి అధికారి వెళ్లి గమనించినవి నమోదు చేయడమే పంచనామా. Ex: అనుమానాస్పద మృతి కేసులో మృతదేహ స్థితి, గది, అక్కడి వస్తువులు సహా చూసిన వివరాలన్నీ రాసుకుంటారు. దర్యాప్తులో ఇవి క్లూ/సాక్ష్యంగా ఉపయోగపడతాయి. గతంలో వివాద పరిష్కారాలకు ఊరి పెద్ద సహా ప్రముఖులు కొందరు కలిసి ఐదుగురు బృందంగా ఉండేవారు. ఏదైనా తగాదాపై వారి ఎదుట పత్రం రాసేవారు కావడంతో పంచనామా పేరు వచ్చింది.
కెనడాలో భారత పౌరుల భద్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంపై వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడుల నుంచి ప్రార్థనా స్థలాల పరిరక్షణకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. దాడులకు పాల్పడిన వారిపై విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామంది. పౌరులకు తమ కాన్సులర్లు చేస్తున్న సాయాన్ని ఈ దాడులు ఆపలేవని పేర్కొంది.
AP: తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు. ‘ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. ఇవన్నీ AP ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.