News November 4, 2024

BCCI తదుపరి సెక్రటరీగా రోహన్ జైట్లీ?

image

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శిగా రోహన్ జైట్లీని నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈనెలలో జైషా ఈ పదవికి రాజీనామా చేసి DEC 1న ICC తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రోహన్ జైట్లీ 2020 నుంచి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ సైతం BCCI సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.

News November 4, 2024

లేబర్ షార్టేజ్ వల్ల నష్టాలేంటి?

image

* ఇన్ఫ్రా సహా కంపెనీల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇది ఎకనామిక్ ఔట్‌పుట్‌పై ప్రభావం చూపిస్తుంది * వర్కర్స్ మధ్య పోటీతో ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇన్‌ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది * కంపెనీలు, ప్రాజెక్టుల విస్తరణ ఆగిపోతుంది. దీంతో ఆ ప్రాంతాల డెవలప్మెంట్ లేటవుతుంది* లేబర్ రిక్రూటింగ్, ట్రైనింగ్, రిటైనింగ్‌కు కంపెనీలు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆపరేషనల్ బడ్జెట్ పెరుగుతుంది.

News November 4, 2024

టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న తూ.గో- ప.గో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి, 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. DEC 5న పోలింగ్ నిర్వహించి 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా ఈ స్థానంలో PDF MLC షేక్ సాబ్జీ గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.

News November 4, 2024

తెలుసా.. కొకైన్‌ను ఔషధంగా వాడారు!

image

డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా బాగా వినిపించే పేరు కొకైన్. అయితే 1880ల్లో ఆస్ట్రియా న్యూరాలజిస్ట్ సెగ్మండ్ ఫ్రెడ్ దీనిపై అనేక పరిశోధనలు చేసి పలు చికిత్సలకు ఔషధంగా వాడారు. దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం కోసం తన స్నేహితుడికి కొకైన్‌ను ఇవ్వగా, అతను దానికి ఎడిక్ట్ అయ్యాడు. ఆ తర్వాత దీని డోస్ ఎక్కువై మరణాలు సంభవించడంతో కొకైన్‌ను ఔషధంగా వాడటం నిలిపివేశాడు.
➼డ్రగ్స్ ప్రాణాంతకం.

News November 4, 2024

ఉపఎన్నిక‌ల తేదీ మార్చిన ఎన్నిక‌ల సంఘం

image

కేర‌ళ‌, పంజాబ్‌, యూపీలో నవంబర్ 13న పలు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నిక‌లను ఎలక్షన్ కమిషన్ నవంబర్ 20వ తేదీకి మార్చింది. కేరళలోని పాలక్కడ్, పంజాబ్‌లోని 4 స్థానాలు, యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈ తేదీ మార్పు వర్తిస్తుంది. Nov 13న మ‌త‌ప‌ర‌మైన‌ కార్య‌క్ర‌మాలు ఉన్నందునా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తేదీ మార్పుపై బీజేపీ, కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు EC వెల్లడించింది.

News November 4, 2024

వరల్డ్ టాప్-5 సిటీల్లో అమరావతిని నిలుపుతాం: మంత్రి నారాయణ

image

AP: ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి నిలిచేలా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానితో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. ప్రస్తుతం రూ.30వేల కోట్లకు సంబంధించి టెండర్ పనులు మొదలయ్యాయని తెలిపారు. డిసెంబర్‌ చివరికల్లా అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణమిస్తోందని, 3ఏళ్లలో పనులు పూర్తి కావాలని CM ఆదేశించారన్నారు.

News November 4, 2024

రోహిత్, విరాట్ భారత క్రికెట్‌కు చాలా చేశారు కానీ..: మాజీ క్రికెటర్

image

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో రాణించకపోతే రోహిత్, విరాట్ టెస్టుల నుంచి రిటైర్ కావాలని భారత మాజీ బౌలర్ కర్సన్ గవ్రీ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశాన్ని ఓడించాలంటే సీనియర్లు రన్స్ చేయాల్సిందే. రోహిత్, విరాట్ భారత క్రికెట్‌కు చాలా చేశారు. కానీ జట్టు గెలవాలంటే రన్స్ కావాలి. భవిష్యత్ కోసం కొత్త జట్టును నిర్మించాలి. పర్ఫార్మెన్స్ ఇవ్వకుంటే ఎంతకాలం టీంలో ఉంచుతారు’ అని ప్రశ్నించారు.

News November 4, 2024

విజయ్‌ను టార్గెట్ చేసిన స్టాలిన్.. టైం వేస్ట్ అంటూ పరోక్షంగా చురకలు

image

DMKను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు కొత్త పార్టీలు స్థాపిస్తున్నారని ద‌ళ‌ప‌తి విజ‌య్‌ను సీఎం స్టాలిన్‌ పరోక్షంగా విమర్శించారు. ‘ఎవరైతే కొత్త పార్టీ స్థాపిస్తున్నారో వారు DMK ఆదరణను చూసి ఓర్వలేక పార్టీ నాశ‌నాన్ని కోరుకుంటున్నారు. మాకు ఈ అంశాల గురించి ఆందోళన లేదు. ప్రజలకు మంచిపనులు చేయడం కోసమే మా ప్రయాణం. ఇలాంటి అనవసర విషయాలకు సమయం వృథా చేయడం మాకు ఇష్టం లేదు’ అంటూ విజయ్‌ను టార్గెట్ చేశారు.

News November 4, 2024

కుల గణన ఎందుకు? సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది?: బండి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ సర్వేకు చేసిన ఖర్చంతా ఆయన నుంచే రికవరీ చేయాలన్నారు. KCR, KTRలను చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం కలుగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు, ఇతర హామీలపై సమాధానం చెప్తూ కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.

News November 4, 2024

కూటమిలో అసంతృప్తి: అంబటి రాంబాబు

image

AP: హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. హోం మంత్రికి హోంలోనే(కూటమిలో) అసంతృప్తి మొదలైందని ట్వీట్ చేశారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేశారు. అటు వైసీపీ శ్రేణులు సైతం కూటమి చీలిపోతోందని, అనిత హోంమంత్రిగా విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.