India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: BJP రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకాన్ని సంక్రాంతి తర్వాతే చేపట్టాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పదవికి పోటీలో డీకే అరుణ, ఈటల, అరవింద్, రఘునందన్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపించగా వీరిలో ఈటల, అరవింద్, రఘునందన్ పేర్లను అధిష్ఠానం షార్ట్ లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

TG: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు మొదలయ్యాయి. రేపటి వరకూ ఫస్ట్ స్టేజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కన్వీనర్ కోటా సీట్లను ముందుగా భర్తీ చేయనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవకుండానే పీజీ కోసం దరఖాస్తు చేసుకున్న 34మందిని వర్సిటీ అనర్హులుగా ప్రకటించింది.

నాలుగో టెస్టులో బుమ్రా మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశారు. 2024లో 13 మ్యాచులు ఆడిన బుమ్రా 14.92 యావరేజ్‌తో 71 వికెట్లు తీసి ఏడాదిని ఘనంగా ముగించారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడో బెస్ట్ బౌలింగ్ యావరేజ్. అలాగే బాక్సింగ్ డే టెస్టుల్లో మొత్తం 24 వికెట్లు తీశారు. అటు, భారత్ స్కోర్ 11 ఓవర్లకు 19/0 ఉండగా, టార్గెట్ 340.

TG: తెలంగాణలో మున్ముందు ఏర్పడేది తమ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. దేశానికి మోదీ తప్ప మరో దిక్సూచి కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుంది. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. 140కోట్లమంది జనాభా ఉన్న భారతదేశం ప్రశాంతంగా ఉందంటే దానికి మోదీ నాయకత్వమే కారణం’ అని పేర్కొన్నారు.

AP: సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10.50 గంటలకు ఆ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

పీఎస్ఎల్వీ సిరీస్‌లోని పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను ఇస్రో నేడు ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నేటి రాత్రి 9.58 గంటలకు రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ఏడాది భారత్‌కు ఇదే ఆఖరి ప్రయోగం.

ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీది ఆత్మహత్య కాదని, హత్యేనని అతడి తల్లి పూర్ణిమ ఆరోపిస్తున్నారు. తాము ప్రైవేటుగా నియమించుకున్న ఇన్వెస్టిగేటర్ ఇదే విషయాన్ని తేల్చారని ఆమె చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ కచ్చితంగా సుచిర్‌ది సూసైడ్లా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె అమెరికా సర్కారును డిమాండ్ చేస్తున్నారు.

ముంబైకు చెందిన కామ్య కార్తికేయన్(17) రికార్డు సృష్టించారు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా చరిత్ర లిఖించారు. ఆసియాలో ఎవరెస్ట్, ఆఫ్రికాలో కిలిమంజారో, యూరప్‌లో ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలో కొసియస్కో, దక్షిణ అమెరికాలో అకాన్‌కగువా, ఉత్తర అమెరికాలో డెనాలీ, అంటార్కిటికాలో విన్సెంట్ పర్వతాల్ని ఆమె అధిరోహించారు. కామ్య ఏడేళ్ల వయసుకే పర్వాతారోహణను ప్రారంభించడం విశేషం.

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్(100) నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా పలు అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్న ఆయన జార్జియాలోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కార్టర్ కుటుంబం తెలిపింది. ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా 1977-1981 మధ్యకాలంలో పనిచేశారు. అమెరికా అధ్యక్షుల్లో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా కార్టర్ రికార్డ్ సృష్టించారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై TDP సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని బియ్యం స్కామ్‌లో స్వయంగా భార్యను ఇరికించారన్నారు. ‘స్కామ్‌లో మీ భార్యను ఇరికించి మీరు తప్పించుకున్నారు. చంద్రబాబుది ఎవర్నీ కించపరిచే మనస్తత్వం కాదు. అలాంటి మనిషి భార్యను అసెంబ్లీలో మీ పార్టీ నేతలు నానా మాటలు అని అవమానించారు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్న మీరు అప్పుడేమయ్యారు?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.