India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల బారిన పడకూడదంటే మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ప్రతీ 3 లేదా 6 నెలలకోసారి మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పొద్దని, ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ తర్వాత వెంటనే మార్చుకోవాలని అంటున్నారు. మీకు సంబంధించిన స్పెషల్ తేదీలు, రకరకాల సింబల్స్, ఎక్కువ అక్షరాలు(కనీసం 16) ఉండేలా, క్లిష్టతరమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు.
‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్ అవుతుందనే డైలాగ్ గుర్తుందా? అలాంటి వాచ్‌లు బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ వద్ద చాలా ఉన్నాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రూ.4.2 కోట్ల విలువైన ‘AUDEMARSPIGUET‘ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను ధరించారు. IIFA 2024 అవార్డ్స్‌లోనూ అదే కంపెనీకి చెందిన రూ.4.6 కోట్ల విలువైన మరో వాచ్‌తో కనిపించారు.
లీటర్ పెట్రోల్ ధర ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో రూ.95గా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో రూ.107కు చేరుకుంది. అయితే, ఆఫ్రికాలోని లిబియా, అమెరికాలోని వెనిజులాలో లీటర్ పెట్రోల్ రూ.3కే లభిస్తుంది. ప్రభుత్వ రాయితీలు, విస్తృతమైన చమురు నిల్వలు ఉండటంతో ఇంత తక్కువకే అక్కడ అందుబాటులో ఉంది. అత్యధికంగా హాంగ్‌కాంగ్‌లో రూ.275, మొనాకోలో రూ.233, ఐస్‌ల్యాండ్‌లో రూ.187, సింగపూర్‌లో రూ.173, ఇటలీలో రూ.172గా ఉంది.
AP: గంజాయి నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం కట్టడిపై మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హోం, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఇందులో ఉండనున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. గంజాయి, మద్యానికి బానిసలైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు, ఇతర అంశాలపై పరిశీలన చేసి నివేదిక సమర్పించాలంది.
స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోవడానికి చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుందనే వార్తలే కారణంగా తెలుస్తోంది. Nov 4-8 వరకు బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా మరో ప్యాకేజీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది! అమెరికాలో ట్రంప్ గెలిస్తే ప్యాకేజీ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో FIIలు తమ పెట్టుబడులను చైనాకు మళ్లిస్తున్నారు.
AP: రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, కూటమిని ఎవరూ చెడగొట్టలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో ఆయన మాట్లాడారు. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయన్నారు. తాను, చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నామని, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమను ఏం చేయలేవని ఆయన చెప్పారు.
డబ్బు తీసుకుని మోసం చేశారంటూ తనపై ఓ యువతి చేసిన ఆరోపణలను యూట్యూబర్ హర్షసాయి ఖండించారు. ఈ కేసులో TG హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొన్ని వారాలుగా విదేశాల్లో ఉన్న అతను ఇవాళ HYD తిరిగొచ్చారు. ‘నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. డిమాండ్ చేయలేదు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారు. రూ.2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. నిజాలు బయటికొచ్చాయి కాబట్టే బెయిల్ వచ్చింది’ అని చెప్పారు.
AP: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే దీనికి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉండనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 మెగా వేలం ఈనెల 24 & 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని, త్వరలో ప్రకటన చేస్తుందని వెల్లడించాయి. అయితే, అదే సమయంలో ఈనెల 22-26 వరకు పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మొదటి టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రసారంతో పాటు IPL వేలం ఈవెంట్ ప్రసారం చేయడంలో హాట్‌స్టార్ ఇబ్బందిపడే అవకాశం ఉంది.
హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ వంటి స్టార్లతో ఆయన పనిచేశారు. 1982లో జాక్సన్‌తో థ్రిల్లర్ ఆల్బమ్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించారు. జోన్స్ 80 సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వగా 28 సార్లు గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.