News March 23, 2024

YCP ఇప్పటివరకూ గెలవని సెగ్మెంట్లు ఇవే

image

AP: రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. ఇందులో కుప్పం, హిందూపురం, చీరాల, కొండెపి, పర్చూరు, గుంటూరు 2, గన్నవరం, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, టెక్కలి, ఇచ్చాపురం స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

News March 23, 2024

నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని MYS స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

News March 23, 2024

మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం!

image

AP: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. గంటా, ఆయన బంధువులు కలిసి బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.390.7 కోట్ల రుణం చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. పద్మనాభం మండలం అయినాడ వద్ద గంటాకు చెందిన స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే నెల 16న వేలం వేయనున్నట్లు వెల్లడించింది.

News March 23, 2024

‘ఉత్తరాఖండ్ టన్నెల్’ నిర్మించిన సంస్థ నుంచి బీజేపీకి భారీ డొనేషన్

image

ఎలక్టోరల్ బాండ్ దాతల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలే ఉండటం చర్చనీయాంశమైంది. వీటిలో ఉత్తరాఖండ్‌లో ఇటీవల కూలిన సిల్క్‌యారా-బార్కోట్ టన్నెల్‌ నిర్మాత నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ 2019 ఏప్రిల్ నుంచి 2022 అక్టోబరు మధ్య రూ.55కోట్లు విలువైన బాండ్లు కొని చేసి బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఇక అదే ఏడాది టన్నెల్ నిర్మాణ పూర్తికి డెడ్‌లైన్ ఉండగా అది కేంద్రం పొడిగించడం గమనార్హం.

News March 23, 2024

త్వరలో భారత్-భూటాన్ మధ్య రైలు సేవలు!

image

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్-భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్‌లో నూతన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది. అస్సాంలోని కోక్రాజర్, బెంగాల్‌లోని బనర్‌హట్ నుంచి భూటాన్‌కు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. 2019-2024 మధ్య రూ.5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న ఐదేళ్లకు దానిని డబుల్ (రూ.10వేలకోట్లు) చేసింది.

News March 23, 2024

పుట్ బాల్ అసోసియేషన్‌కు సిగ్గుండాలి: హీరో నిఖిల్

image

ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి ఫలితాలు సాధించడం ఏంటీ? ఇందుకు భారత ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి’ అని ఆయన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, IFCకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News March 23, 2024

నేడు కాంగ్రెస్‌లోకి హైదరాబాద్ మేయర్?

image

TG: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మేయర్‌తోపాటు ఆమె తండ్రి, BRS నేత కే కేశవరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో చర్చలు జరిపినట్లు టాక్.

News March 23, 2024

బోర్‌గా ఫీలవడం కూడా మంచిదే!

image

బోర్‌గా ఫీలవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఫోన్‌ను పక్కనపెట్టి క్రియేటివిటీపై దృష్టి పెట్టాలంటున్నారు. మీలో కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేసేందుకు ఇది దోహదపడుతుందని, బోర్‌గా అనిపించినప్పుడు ఇతరులతో మాట్లాడటం వల్ల కమ్యూనికేషన్ పెరిగి బంధాలు బలపడతాయని అంటున్నారు. ఏ పని లేనప్పుడు శరీరంతో పాటు మైండ్‌కు విశ్రాంతి దొరుకుతుందని, ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

News March 23, 2024

IPL 2024 టైటిల్ విజేత ఆ జట్టే?

image

IPL 2024 టైటిల్ విజేతగా సీఎస్కే జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

News March 23, 2024

ఆలపాటి రాజాను బుజ్జగించిన బాబు

image

AP: టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు. పొత్తులో జరిగిన సర్దుబాట్లను అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. బాబు బుజ్జగింపుతో రాజా మెత్తబడ్డారు. మరోవైపు బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా బాబును కలిశారు. కాగా తెనాలి సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో ఆలపాటికి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.