India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలకు అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. తాజాగా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా నిన్న ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. విశాఖ పార్టీ ఆఫీస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.
నీట్ రీఎగ్జామ్‌కు గ్రేస్ మార్కులు కలిపిన వారిలో సగం మంది డుమ్మా కొట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో NTA 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఆదేశాలతో గ్రేస్ మార్కులు రద్దు చేసిన NTA ఇవాళ వారికి మళ్లీ పరీక్ష నిర్వహించింది. 1,563 మందిలో 813 మంది హాజరుకాగా 750 మంది గైర్హాజరయ్యారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. నాలుగోబ్లాక్‌లో ఉన్న ఆయన ఛాంబర్లో కొన్ని మార్పుల పెండింగ్ కారణంగా పదవీ స్వీకారం ఆలస్యం అయినట్లు సమాచారం. తాజాగా అవి పూర్తి కావడంతో బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఆయన ఇప్పటి వరకు విధుల్ని నిర్వహిస్తున్నారు.
T20 WCలో మరో సంచలనం నమోదైంది. అమెరికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్లో మొత్తం 4వికెట్లు పడగొట్టారు. 19వ ఓవర్ వేసిన అతడు తొలి బంతికి కోరీ అండర్సన్‌ను వెనక్కి పంపారు. తర్వాత 3,4,5 బంతుల్లో వరుసగా అలీ ఖాన్, నొతుష్, నేత్రావల్కర్‌ను ఔట్ చేశారు. ఇవాళ ఉదయమే అఫ్గాన్‌పై కమిన్స్ హ్యాట్రిక్ తీశారు. ఈ WCలో ఇది మూడో హ్యాట్రిక్ కాగా కమిన్స్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి సమయంలో ఆమె తెలుపురంగు ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ చీర ధరించారు. కాగా ఏడేళ్లుగా జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు.
ప్రభాస్ ‘కల్కి2898AD’కి బదులు తన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యాయన్న వార్తలపై హీరో రాజశేఖర్ స్పందించారు. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు. ప్రభాస్, నాగ్అశ్విన్, అశ్వినీదత్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ కల్కి చరిత్ర సృష్టించాలని రాజశేఖర్ అన్నారు. కాగా ఆయన ట్వీట్‌పై స్పందించిన కూతురు శివాత్మిక.. ‘మా నాన్న! లివింగ్ లెజెండ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.
కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు తాజాగా లేఖ రాశారు. ‘వయనాడ్ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మీకు పెద్ద పరిచయం లేకపోయినా ఐదేళ్ల క్రితం నన్ను నమ్మి గెలిపించారు. ఇప్పుడు మీ తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక ఉన్నారు. ఆమెకు అవకాశం ఇస్తే అద్భుతంగా పనిచేస్తారు. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటా. థాంక్స్’ అని రాసుకొచ్చారు.
AP: పింఛన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ పంపిణీ చేయనున్నట్లు టీడీపీ తెలిపింది.
T20 WCలో పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. జట్టుకు మిగిలి ఉన్న కాస్తో కూస్తో పరువును కూడా తాజాగా పాక్ పార్లమెంటు తీసేసింది. బాబర్ సేనపై ఎంపీలే విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ తరహాలోనే బాబర్ కూడా ఓటమికి కారణాలు వెతుక్కోవాలని, అనంతరం ఇతరులను బాధ్యుల్ని చేయాలని ఎద్దేవా చేశారు.
TG: తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఇవాళ చిరంజీవిని కలిశారు. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని ఆయన ట్విటర్లో ఫొటోలు షేర్ చేశారు.
Sorry, no posts matched your criteria.