News June 23, 2024

‘కల్కి’ టికెట్ల బుకింగ్స్‌పై స్పందించిన రాజశేఖర్

image

ప్రభాస్ ‘కల్కి2898AD’కి బదులు తన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యాయన్న వార్తలపై హీరో రాజశేఖర్ స్పందించారు. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు. ప్రభాస్, నాగ్‌అశ్విన్, అశ్వినీదత్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ కల్కి చరిత్ర సృష్టించాలని రాజశేఖర్ అన్నారు. కాగా ఆయన ట్వీట్‌పై స్పందించిన కూతురు శివాత్మిక.. ‘మా నాన్న! లివింగ్ లెజెండ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.

News June 23, 2024

వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ

image

కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు తాజాగా లేఖ రాశారు. ‘వయనాడ్ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మీకు పెద్ద పరిచయం లేకపోయినా ఐదేళ్ల క్రితం నన్ను నమ్మి గెలిపించారు. ఇప్పుడు మీ తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక ఉన్నారు. ఆమెకు అవకాశం ఇస్తే అద్భుతంగా పనిచేస్తారు. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటా. థాంక్స్’ అని రాసుకొచ్చారు.

News June 23, 2024

జులై 1న రూ.7,000 పింఛన్: TDP

image

AP: పింఛన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ పంపిణీ చేయనున్నట్లు టీడీపీ తెలిపింది.

News June 23, 2024

పాక్ పార్లమెంటులోనూ బాబర్ సేనపై ఆగ్రహం

image

T20 WCలో పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. జట్టుకు మిగిలి ఉన్న కాస్తో కూస్తో పరువును కూడా తాజాగా పాక్ పార్లమెంటు తీసేసింది. బాబర్ సేనపై ఎంపీలే విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ తరహాలోనే బాబర్ కూడా ఓటమికి కారణాలు వెతుక్కోవాలని, అనంతరం ఇతరులను బాధ్యుల్ని చేయాలని ఎద్దేవా చేశారు.

News June 23, 2024

అప్పటి నుంచే అన్నయ్య అభిమానిని: బండి

image

TG: తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఇవాళ చిరంజీవిని కలిశారు. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని ఆయన ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేశారు.

News June 23, 2024

‘కల్కి’.. రాజశేఖర్ మూవీకి టికెట్లు బుక్ అయ్యాయ్!

image

బుక్‌ మై షోలో ‘కల్కి2898AD‌’ టికెట్లు బుక్ చేసుకుంటున్నవారికి చేదు అనుభవం ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సెర్చ్‌లో ‘కల్కి’ అని టైప్ చేయగానే ‘కల్కి2898AD‌’, రాజశేఖర్ నటించిన ‘కల్కి’ పేర్లు కనిపిస్తున్నాయి. ఆత్రుతలో రాజశేఖర్ మూవీకి బుక్ చేసుకున్నట్లు కొందరు Xలో వాపోతున్నారు. బుక్‌ మై షోకు ఫిర్యాదు చేయగా.. ఆందోళన చెందొద్దని, ప్రభాస్ మూవీకే బుక్ అయినట్లు చెప్పింది. తర్వాత రాజశేఖర్ కల్కిని తొలగించింది.

News June 23, 2024

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

సౌతాఫ్రికా-Wతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా-W స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్‌ప్రీత్(3,565) ఉన్నారు. కాగా ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో మంధాన సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

News June 23, 2024

SA-Wపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

image

భారత మహిళల జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 215/8 స్కోర్ చేయగా, టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్‌ప్రీత్ 42, జెమీమా 19* రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతీరెడ్డి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

News June 23, 2024

కల్తీ మద్యం కుట్ర వెనుక అన్నామలై: DMK నేత

image

తమిళనాడులో కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన మిథనాల్‌ను NDA పాలిత పుదుచ్చేరి నుంచి సేకరించారని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి తెలిపారు. ఈ కుట్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అమలు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జరిగిందా అనే సందేహం ఉందన్నారు. ఈ మరణాలకు బాధ్యత వహించి CM స్టాలిన్ రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ఎవరైనా రిజైన్ చేయాల్సి వస్తే అది పుదుచ్చేరి సీఎం, బీజేపీ మంత్రులేనని స్పష్టం చేశారు.

News June 23, 2024

దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు ఏర్పాటు చేస్తాం: SBI

image

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరో 400 శాఖల్ని ఏర్పాటు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్ ఖారా ప్రకటించారు. గత ఏడాది 137 తెరిచామని, వాటిలో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వెల్లడించారు. తమ సేవలు అవసరం అనుకున్న ప్రాంతాల్లో శాఖల్ని తెరవనున్నట్లు వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి ఎస్‌బీఐకి 22,542 శాఖలుండటం విశేషం.