News June 24, 2024

Shocking: 14 ఏళ్లలో భూమితో గ్రహశకలం ఢీ?

image

మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈమేరకు తేలిందని పేర్కొంది. మరిన్ని అధ్యయనాల అనంతరం దాని దిశ ఎలా మార్చాలన్న దానిపై కృషి చేస్తామని వివరించింది.

News June 24, 2024

T20WC: పడి లేచిన కెరటం ఇంగ్లండ్..!

image

టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జర్నీ పడుతూ లేస్తూ కొనసాగుతోంది. లీగ్ స్టేజీలోనే దాదాపు ఎలిమినేట్ అయ్యే దశకు ఆ జట్టు చేరుకుంది. మరో 15 నిమిషాలు వర్షం కురిసుంటే ఇంగ్లండ్ అప్పుడే టోర్నీ నుంచి నిష్క్రమించేది. చివరకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నమీబియాపై గెలిచింది. సూపర్-8కు చివరగా అర్హత సాధించింది ఇంగ్లండ్ జట్టే. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టు కూడా ఇదే.

News June 24, 2024

‘కన్నప్ప’లో మరో హీరో?

image

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కోలీవుడ్ హీరో శింబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరే అవకాశాలు ఉన్నాయి.

News June 24, 2024

చరిత్ర సృష్టించిన మహ్మద్ నబీ..!

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ చరిత్ర సృష్టించారు. 45 దేశాలపై అఫ్గాన్ సాధించిన విజయాల్లో ఆయన భాగమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, కెనడా, కెన్యా, యూఏఈ, యూఎస్ఏ, ఒమన్, సౌదీ అరేబియా, డెన్మార్క్, జపాన్, చైనా, కువైట్ తదితర దేశాలపై ఆయన ఆడారు.

News June 24, 2024

వరల్డ్ కప్ నుంచి అమెరికా ఔట్

image

టీ20 వరల్డ్ కప్ నుంచి అతిథ్య అమెరికా జట్టు నిష్క్రమించింది. సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీఫైనల్ రేసుకు దూరమైంది. దీంతో సూపర్-8 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా యూఎస్ఏ నిలిచింది. కాగా యూఎస్ఏ జట్టు లీగ్ మ్యాచుల్లో అదరగొట్టింది. పాకిస్థాన్, కెనడాపై గెలిచి సూపర్-8లో అడుగుపెట్టింది. ఇండియాపై ఓ మ్యాచ్ ఓడగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

News June 24, 2024

ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో పాండ్య ఉంటారు: ఆరోన్

image

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఉంటారని మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ అభిప్రాయపడ్డారు. ‘వరల్డ్ కప్‌నకు ముందు హార్దిక్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఐపీఎల్‌లో ఏమాత్రం ఫామ్ లేదు. బౌలింగ్‌లో పస లేదు. కానీ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వచ్చేసరికి అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మానసికంగా తను ఎంత బలమైన ఆటగాడు అన్నదానికి ఇదే నిదర్శనం’ అని వివరించారు.

News June 24, 2024

జూన్ 24: చరిత్రలో ఈ రోజు

image

1902: సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం
1908: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మరణం
1928: సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ జననం
1940: నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ జననం
1953: భారత తంతి తపాలా శాఖలో టెలెక్స్ సేవలు ప్రారంభం
1966: సినీ నటి విజయశాంతి జననం
2008: హాస్యనటుడు మల్లికార్జునరావు మరణం

News June 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 24, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 24, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:44 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.