India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
Jr.NTR హీరోగా నటిస్తున్న ‘దేవర’ షూటింగ్ ఒక సాంగ్ మినహా దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం థాయిలాండ్‌లో తారక్, జాన్వీ కపూర్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్‌తో తీసుకున్న ఫొటోలను బోస్కో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
TG: రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినా BRS ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఓడిపోయిన బాధలో కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులతో హంగేరీ యువత వివాహాలపై ఆసక్తి చూపట్లేదు. జననాలు తగ్గిపోవడంతో ఆ దేశ PM విక్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే మహిళలకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు. 41ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటే ₹22 లక్షల సబ్సిడీ రుణాలను 2019 నుంచి ఇస్తున్నారు. ఇద్దరికి జన్మనిస్తే మూడోవంతు, ఆపైన పిల్లలను కంటే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తున్నారు.
AP రైతులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశారు. ఆ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇవాళ ఇంధన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. GOVT ఆఫీసులకు సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, PM సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికీ 3 కిలోవాట్ల సోలార్ కరెంట్ అందించే ఫైళ్లపైనా సైన్ చేశారు. ఏపీ విద్యుత్ శాఖను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు.
TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల వ్యవధిని పెంచాలి. గ్రూప్-2, 3లో మరిన్ని ఉద్యోగాలను కలపాలి. 25వేల పోస్టులతో మెగా DSC విడుదల చేయాలి. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి బకాయిలతో సహా చెల్లించాలి. GO46ను రద్దు చేయాలి’ అని కోరారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసు బయటే ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడే కుర్చీలు వేసి ప్రజలతో మాట్లాడి వారి అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు స్పెషల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అతనితో పాటు ఈ కేసులో ఇతర నిందితులను జులై 4 వరకు జుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులను ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
AP: తిరుమల లడ్డూ ధర తగ్గింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. రూ.300 స్పెషల్ ఎంట్రీతో పాటు లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. కాగా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ధరలను రూ.200కు, లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
X(ట్విటర్)లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కలిగిన యూజర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్‌ను ప్రారంభించేలా కొత్త నిబంధన రానుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం Xలో బేసిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు ₹215తో ప్రారంభమవుతోంది. కమర్షియల్ యాడ్స్ నుంచి ఆదాయం తగ్గడంతో సబ్‌స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆ సంస్థ ఓనర్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం.
AP: తాను ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘కేవలం మంగళగిరి నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా నన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాను’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.