India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుమారు 10లక్షల కాకులను అంతమొందించేందుకు కెన్యా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వలస వెళ్లి తమ దేశ పర్యావరణం, పరిశ్రమలను దెబ్బ తీస్తున్నాయట. ఆహారాన్ని దొంగలించడం, పంటలకు నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఒక వరల్డ్ కప్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పూరన్ 17 సిక్సర్లు బాదారు. దీంతో గేల్ (16) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో శామ్యూల్స్-15(2012), వాట్సన్-15(2012) ఉన్నారు.
చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మెయిజౌ నగరంలో శుక్రవారం 38 మంది మరణించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
MPలోని ఉజ్జయినిలో 20ఏళ్ల గిరిజన వివాహితపై ఇద్దరు అత్యాచారం చేశారు. ఉపాధి కోసం వచ్చిన నిరుపేద దంపతులను గమనించిన రవి అనే వ్యక్తి పని ఇప్పిస్తానని ఓ ఇంట్లో ఉంచాడు. భర్తను పని సాకుతో ఊరి బయట దింపేందుకు తీసుకెళ్లాడు. అప్పుడు రవి అనుచరుడు ఇమ్రాన్ ఆమెను రేప్ చేశాడు. తర్వాత రవి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను తాను కాపాడుకోవడానికి బాధితురాలు 1.5kmలు అర్ధనగ్నంగా పరిగెత్తినట్లు పోలీసులు తెలిపారు.
TG: రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండ(D) పాలెం గ్రామానికి చెందిన AEO పరశురాములు సీఎం రేవంత్‌ను కోరారు. కుటుంబంలో తానొక్కడినే కిందిస్థాయి ఉద్యోగినని, ఇద్దరు తమ్ముళ్లు కూలీ పనులు చేస్తారన్నారు. తనకు ఉద్యోగం ఉందని తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి, ఫించన్లు ఇవ్వడం లేదని తెలిపారు. తన తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు.
AP: తాడేపల్లిలో YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై YS జగన్ స్పందించారు. ‘రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన YCP కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని ట్వీట్ చేశారు.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్8 పోరులో USAపై వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమెరికా 128 రన్స్ చేయగా ఛేదనకు దిగిన విండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 130 రన్స్ కొట్టింది. ఓపెనర్ హోప్(82రన్స్, 39బంతుల్లో) భారీ అర్ధశతకంతో మెరుపులు మెరిపించారు. ఆ గెలుపుతో వెస్టిండీస్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండగా USA ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.45 గంటలకు ట్రైన్ విశాఖ నుంచి బయల్దేరాలి. కానీ సి-9 కోచ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఉ.10 గంటలకు ట్రైన్ బయల్దేరనుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
AP: అమరావతి ప్రాంతంలో ముళ్ల కంపలను తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. 217 చదరపు కిలోమీటర్లలో మెజార్టీ ఏరియా అడవిలా తయారైందని చెప్పారు. ముళ్ల కంపలను తొలగించిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై అంచనాకు వస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు.
విదేశీ మారక నిల్వలు తగ్గినట్లు RBI తెలిపింది. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి గాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బి.డాలర్లకు చేరినట్లు తెలిపింది. అంతకుముందు వారం రికార్డు స్థాయి 655.817 బి.డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. యూరో, పౌండ్, యెమెన్ కరెన్సీలు ఒత్తిడికి గురికావడమే ఫారెక్స్ నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం రిజర్వులు కూడా 1.015 బి. డాలర్లు తగ్గి 55.967 బి.డాలర్లకు పడిపోయాయి.
Sorry, no posts matched your criteria.