News December 25, 2024

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ PM వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం BJP జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే NDA నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలి, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.

News December 25, 2024

ఏపీకి రూ.446 కోట్లు విడుదల

image

AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.

News December 25, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ: హిస్టరీ, విజేతలు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 1998లో ప్రారంభమైన ఈ ట్రోఫీలో 2009 నుంచి ICC ర్యాంకింగ్స్‌లోని టాప్-8 జట్లు పాల్గొంటున్నాయి. టెస్టులు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది మొదలైంది. ఆరంభ ఎడిషన్‌లో SA విజేతగా నిలిచింది. 2000లో NZ, 2002లో శ్రీలంక-భారత్, 2004లో WI, 2006, 09లో AUS, 2013లో IND, 2017లో పాక్ టైటిల్‌ను సాధించాయి.

News December 25, 2024

అక్రిడేషన్ గడువు మరో 3 నెలలు పొడిగింపు

image

TG: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులిచ్చింది. డిసెంబ‌ర్ 31వ తేదీతో గడువు ముగియనుండగా, జ‌న‌వ‌రి 1 నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు అక్రిడేషన్లు పనిచేస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఆర్టీసీ సంస్థ‌కు అధికారులు తెలియ‌జేశారు.

News December 25, 2024

ఒకప్పుడు విపరీతంగా తాగేవాడిని: ఆమిర్ ఖాన్

image

తన వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లలేదని హీరో ఆమిర్ ఖాన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎన్నో చెడు అలవాట్లు ఉండేవని ఒప్పుకున్నారు. ‘నేను విపరీతంగా మద్యం తాగేవాడిని. పైప్ స్మోకింగ్ చేసేవాడిని. తప్పుచేస్తున్నానని గ్రహించినా మానలేకపోయా. సినిమానే నాలో మార్పు తీసుకొచ్చింది’ అని చెప్పారు. ఇకపై ఏడాదికి ఓ మూవీ చేస్తానని పేర్కొన్నారు.

News December 25, 2024

27, 28, 30 తేదీల్లో మ్యూజిక్ టీచ‌ర్లకు డెమో

image

TG: గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగ‌వంత‌మైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన‌ అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమాన్‌స్ట్రేషన్ నిర్వహించ‌నున్న‌ట్లు TREIRB వెల్లడించింది. మాసాబ్‌ట్యాంక్‌లోని DSS భవన్‌లో ప్రతి రోజు రెండు సెషన్స్‌లో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు treirb.cgg.gov.in వెబ్‌సైట్‌లో షెడ్యూల్ చెక్ చేసుకుని ఆయా తేదీల్లో హాజరు కావాలని సూచించింది.

News December 25, 2024

English Learning: Antonyms

image

✒ Consolidate× Weaken
✒ Confident× Diffident, cowardly
✒ Creation× Destruction
✒ Courtesy× Disdain, Rudeness
✒ Cunning× Naive, Coarse
✒ Decipher× Misinterpret, distort
✒ Decay× Flourish, Progress
✒ Deceit× Veracity, Sincerity
✒ Defray× Disclaim, Repudiate

News December 25, 2024

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు వెంటాడుతున్నాయి: రామ్మోహన్

image

AP: YCP హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని తెలిపారు. గతంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

News December 25, 2024

మహాకుంభమేళాకు విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్లు

image

JAN 13 నుంచి FEB 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్ కోస్టల్ రైల్వే వెల్లడించింది. విశాఖ-గోరఖ్‌పుర్ మధ్య JAN 5, 19, 16 తేదీల్లో 08562 నంబర్ రైలు ప్రయాణిస్తుందని తెలిపింది. విశాఖ-దీన్‌దయాళ్ స్టేషన్ల మధ్య 08530 నంబర్ రైలు JAN 9, 16, 23, FEB 6, 20, 26 తేదీల్లో నడుస్తుందని పేర్కొంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించింది.

News December 25, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱిగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
తాత్పర్యం: ఇత్తడిని ఎన్నిసార్లు కరిగించి పోసినా బంగారం కాదు. అలాగే ఈ లోకంలో నీచులకు ఎంత బుద్ధి చెప్పినా వారిలో మంచి గుణాలు కలగవు.