India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే ఫ్యామిలీ కార్డుగా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటి మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థ ఉండాలని సూచించారు. దీని కోసం పలు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.
AP: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలోని బదలాపూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసులు వాహనం ఎక్కిస్తుండగా వారి నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని థానే పోలీసులు వెల్లడించారు.
TG: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ నేతల్లా తాము దోచుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 3 రోజుల్లో పంట నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అమృత్ టెండర్లలో తన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించలేదని అన్నారు.
AP: వరద బాధితులకు కుమారి ఆంటీ తన వంతుగా సాయం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి రూ.50 వేల చెక్కును ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. అనంతరం కుమారి ఆంటీ ఆమె కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. అంతకుముందు కుమారీ ఆంటీ తెలంగాణ సీఎంను కలిసి విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో దేవర సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. SEP 27న రాష్ట్రంలోని 29 థియేటర్లలో రూ.100 పెంచి అర్ధరాత్రి ఒంటిగంటకు అదనపు షో వేసుకునేందుకు ఓకే చెప్పింది. అన్ని థియేటర్లలో తెల్లవారుజామున 4 గంటలకు రూ.100 పెంచి రోజుకు 6 షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.25, మల్టీప్లెక్సుల్లో రూ.50 హైక్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
భారత్ నుంచి ఆస్కార్-2025కి ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘లాపతా లేడీస్’ను నామినేట్ చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ జాబితాలో 29 సినిమాలను FFI పరిశీలించింది. వీటిలో తెలుగు సినిమాలు హనుమాన్, కల్కి, మంగళవారం ఉన్నాయి. అత్యధికంగా హిందీ నుంచి 12, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఒకటి ఉన్నాయి. అంతిమంగా ‘లాపతా లేడీస్’కే ఫెడరేషన్ ఓటేసింది.
లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని తమిళనాడు గవర్నర్ RN రవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. లౌకికవాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.
ఒత్తిడిని ఎదుర్కోవడానికి అంతర్గత బలం ఉండాలని, అది దైవత్వం నుంచి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఆ దిశగా పిల్లల్ని పెంచాలంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేరళకు చెందిన యువ CA మృతిపై ఆమె ఈ విధంగా స్పందించారు. నిర్మల వ్యాఖ్యలను కేరళ CPM, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. నిర్మల IT ఉద్యోగులను దోపిడీ చేసే కార్పొరేట్ డ్రాక్యులాలకు రక్షకురాలిగా మారారని విమర్శించాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో గ్యాడ్జెట్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ₹1.09 లక్షల విలువ చేసే ఐఫోన్ 15 ప్రో ₹89,999కి, ₹1.34 లక్షల విలువగల 15ప్రో మ్యాక్స్ ₹99,999కి లభించనుంది. అమెజాన్‌లో ₹99,900 విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్(M1, 2020) ₹52,990కి లభించనుంది. యాపిల్ ల్యాప్‌టాప్స్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.