News September 23, 2024

మంత్రి సీతక్కతో నమ్రత

image

TG: సీఎం రేవంత్ నివాసంలో మంత్రి సీతక్కను సినీ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. మంత్రితో కాసేపు ముచ్చటించారు. మహేశ్ బాబు, నమ్రత ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌ను కలిసి వరద బాధితుల కోసం రూ.60 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!

image

పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.

News September 23, 2024

రేపు ఉ.10 గం.కు రూ.300 టోకెన్లు విడుదల

image

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం (రూ.300) టోకెన్లను రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి గదుల కోటాను రేపు మ.3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు, టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని పేర్కొంది.

News September 23, 2024

పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో!

image

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నారు. SUNDEEP KISHANలో A తొలగించి SUNDEEP KISHNగా ఛేంజ్ చేసుకున్నారు. అలాగే పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్‌ను జత చేసుకున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న మూవీకి ‘మజాకా’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. దీనిని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

News September 23, 2024

Stock Market: బుల్ ర్యాలీ కొనసాగింది

image

స్టాక్ మార్కెట్‌లో బుల్ ర్యాలీ సోమ‌వారం కూడా కొన‌సాగింది. సెన్సెక్స్ 384 పాయింట్ల లాభంతో 84,928 వ‌ద్ద‌, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,939 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. బ‌జాజ్ ఆటో, M&M, ONGC, Hero Motocorp, Sbi Life టాప్ గెయిన‌ర్స్‌. ఐచ‌ర్‌, ICICI, Divis Lab, WIPRO టాప్ లూజర్స్‌. ఫెడ్ రేట్ల‌ కోత‌తో అమెరికా మాంద్యం భ‌యాలు త‌గ్గ‌డం, విదేశీ పెట్టుబ‌డులు పెర‌గ‌డంతో దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.

News September 23, 2024

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందీశ్వరి

image

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని కేంద్ర ప్రభుత్వం కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆఫీసు ఉత్తర్వులు జారీ చేసింది. 2026 చివరి వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కూడా ఆమె నామినేట్ అయ్యారు.

News September 23, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన బుమ్రా

image

టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచ క్రికెట్‌లో 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా బుమ్రా నిలిచారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కలిపి 14 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు తీశారు. 43 వికెట్లతో శ్రీలంక ప్లేయర్ హసరంగా రెండో స్థానంలో ఉన్నారు. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ బుమ్రా 5 వికెట్లు పడగొట్టారు.

News September 23, 2024

శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గంటలకు ఇలా చేయండి: టీటీడీ

image

తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన ఆచార్యుల సూచనల మేరకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ ‘క్షమ మంత్రం’ చదవాలని టీటీడీ కోరింది. ‘ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..’ మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’.. డైరెక్టర్ ఏమన్నారంటే?

image

ఆస్కార్ 2025కి ‘లాపతా లేడీస్’ మూవీని పంపనున్నట్లు <<14173124>>ప్రకటించడంపై<<>> దర్శకురాలు కిరణ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాను అకాడమీ అవార్డ్స్ అధికారిక ఎంట్రీ కోసం ఎంపిక చేయడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఇది తన టీమ్ అలుపెరగని కృషికి దక్కిన గుర్తింపు అని తెలిపారు. హృదయాలను ఆకట్టుకోవడానికి, సరిహద్దులను చెరిపివేయడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమమని రాసుకొచ్చారు.

News September 23, 2024

యాంటీబయాటిక్స్‌కు స్పందించని బ్యాక్టీరియాలు

image

దేశంలో ప‌లు ఇన్ఫెక్ష‌న్ల‌కు ఉప‌యోగించే యాంటీబ‌యాటిక్స్‌కు కొన్ని ర‌కాల‌ బ్యాక్టీరియాలు స్పందించ‌డం లేద‌ని కొత్త అధ్య‌య‌నం తేల్చింది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు (UTI), బ్లడ్ ఇన్ఫెక్షన్‌లు, న్యుమోనియా, టైఫాయిడ్ వంటి కొన్ని వ్యాధులకు చికిత్స ప‌ద్ధ‌తులు కష్టతరంగా మారుతున్నాయి. ఎందుకంటే వాటికి కారణమయ్యే బ్యాక్టీరియా సాధారణ యాంటీబయాటిక్‌లకు స్పందించడం లేదని ICMR-AMRSN జ‌రిపిన అధ్య‌య‌నంలో తేలింది.