India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వన్యమృగాల్లోనూ ప్రేమ ఉంటుంది. రష్యాలో బోరిస్ అనే ఓ సైబీరియన్ పులి తన ప్రియురాలిని కలుసుకునేందుకు 200KMS (124 మైళ్లు) ప్రయాణించింది. వన్యమృగాల పరిరక్షణలో భాగంగా ఆడ-మగ పులులను అటవీ అధికారులు పెంచారు. కొన్నేళ్ల క్రితం వీటిని చెరో అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో తనతో పెరిగిన ఆడపులి స్వెత్లాయాను కలుసుకునేందుకు బోరిస్ వందల కి.మీలు నడుస్తూ దానిని చేరుకుంది. GPS కాలర్ బెల్ట్ ద్వారా ఇది గుర్తించారు.

ఫామ్ అందుకోవాలంటే విరాట్ కోహ్లీ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ సూచించారు. ‘బంతిని వేటాడకుండా దాన్ని తన వద్దకు రానివ్వాలి. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చాలా సులువవుతుంది. విరాట్ త్వరపడుతున్నారు. తర్వాతి టెస్టులో ఆయన వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. టైమ్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. గడచిన 5 ఇన్నింగ్స్‌లలో విరాట్ 126 పరుగులు మాత్రమే చేశారు.

BRS సర్కారు 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని CM రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తెచ్చారు. రూ.వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్‌లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.

ఎలక్ట్రిక్ సహా పాత కార్ల అమ్మకాలపై GST రేటును పెంచుతున్నారని సమాచారం. ఈ లావాదేవీలపై పన్నును 12 నుంచి 18%కి సవరించేందుకు మండలి ఆమోదం తెలిపినట్టు ET పేర్కొంది. 50% పైగా ఫ్లైయాష్ ఉండే కాంక్రీట్ బ్లాకులపై పన్నును 18 నుంచి 12కు తగ్గించారని తెలిపింది. ఉప్పు, మసాలా దట్టించిన రెడీ టు ఈట్ పాప్‌కార్న్‌పై 5%, ప్రీప్యాక్డ్, లేబుల్ వేస్తే 12%, కారమెల్ వంటి షుగర్ కోటింగ్ వేస్తే 18% GST వర్తిస్తుందని సమాచారం.

భారత్‌లో వారసత్వ పన్ను అవసరమేనని జెరోదా ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ అంటున్నారు. సమాజానికి పంచకుండా తరతరాలుగా సంపద ఒకేదగ్గర పోగుపడటం సబబు కాదన్నారు. ‘ఒక తరం సంపదను పొందిన ప్రతిసారీ దానిపై కొంత పన్ను చెల్లించడం సరైనదే. భారత్‌లో దీన్ని అమలు చేయడం సవాలే. కానీ ఏదో ఒక మార్గం వెతకాలి. సంపదను తిరిగివ్వడానికి సంపన్నులు మరింత కృషి చేయాలనేదే నా సలహా’ అని అన్నారు. కామత్ Podcastల్లో మాట్లాడటం తెలిసిందే.

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఉతప్ప ఉద్యోగుల జీతాల నుంచి ₹23 లక్షలు కట్ చేసి EPFOలో జమ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈక్రమంలో కర్ణాటక పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షర గోపాల రెడ్డి ఈ వారెంట్ జారీ చేశారు.

TG: రైతులకు మేలు చేసేలా BRS సూచనలు చేస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని CM ఎద్దేవా చేశారు.

SBI 13,735 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో 609 బ్యాక్‌లాగ్ పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా, JAN 7 వరకు అప్లై చేయవచ్చు. APలో 50, TGలో 342 ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు.

TG: సాగులో లేని భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ‘రూ.22వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు అందింది. రోడ్లు వేసిన భూములకూ డబ్బులు పడ్డాయి. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?’ అని అసెంబ్లీలో MLAలను అడిగారు. రైతుభరోసాపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందరికీ ఇస్తాం’ అని వెల్లడించారు.

TG: పొలాలకు వెళ్లే రోడ్ల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కోరారు. ‘పొలానికి ఎరువులు తీసుకెళ్లాలన్నా, కూలీలను తరలించాలన్నా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ప్రస్తుతం ఏ రైతులు సంతోషంగా లేరు. పరిశ్రమలు పెట్టే వాళ్లకు రాయితీలు ఇస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం. రైతుల పిల్లలకు 90% రాయితీతో కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలి’ అని కోరారు.
Sorry, no posts matched your criteria.