India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయ్ భాను ఛిబ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయ్ భాను గతంలో జమ్మూ కశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈ నియామకం జరగడం గమనార్హం.
TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 1-2 గంటల్లో తూర్పు హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మెదక్, వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
AP: దైవాన్ని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యిని టెస్ట్ చేశారు. అందులో కల్తీ జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత. జగన్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఎప్పుడూ వారి ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని CM గుర్తుపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈఓతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈఓ తెలిపారు. TTD తరఫున రేపు మహాశాంతి యాగం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
AP: వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాను సర్వనాశనం చేశారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. ‘వైసీపీ హయాంలో నాపై 32 అక్రమ కేసులు పెట్టించారు. చంద్రబాబును కూడా బాలినేని దూషించారు. టీడీపీ కార్యకర్తలను వేధించారు. ఇప్పుడు జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూట్‌కు సంబంధించిన ఫొటోలూ వైరలయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ సినిమాలోనే ఆయన నటిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇద్దామని వార్నర్ ఎంట్రీ ప్లాన్ చేసినా ముందుగానే ఫొటోలు లీక్ అయ్యాయని పేర్కొన్నాయి. అంతకుముందు పుష్ప-2లో వార్నర్ నటిస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ(113)తో అదరగొట్టి, సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 5వికెట్లు తీయడం అశ్విన్‌కిది 4వసారి. ఇయాన్ బోథమ్(5) టాప్‌లో ఉన్నారు. ఒకే వేదికపై(చెన్నై) ఈ ఫీట్ 2సార్లు(2021, 2024) నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే.
దులీప్ ట్రోఫీలో ఇండియా-బీతో జరిగిన మ్యాచులో ఇండియా-డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా-డీ 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా-బీ 282 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో IND-D 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-బీ 115 పరుగులకే ఆలౌటైంది. ఇండియా-డీ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు.
AP: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థీ గెలవడానికి అవసరమైన 50% ఓట్లను దక్కించుకోలేకపోయారు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్‌కు (ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు) ఎన్నికల సంఘం ఆదేశించింది. మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు.
Sorry, no posts matched your criteria.