India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

Prime యూజర్లకు Amazon షాక్ ఇచ్చింది. జనవరి 2025 నుంచి కొత్త నిబంధనను తీసుకొస్తోంది. వచ్చే నెల నుంచి ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు ఒక్కో ఖాతా 5 డివైజుల్లో మాత్రమే వినియోగించవచ్చు. అందులో రెండు టీవీల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఒకవేళ మూడో టీవీలో లాగిన్ అయితే మూడు నిమిషాల్లో లాగౌట్ అవుతుంది. ప్రస్తుతం యూజర్లు 10 డివైజుల్లో(5 టీవీలు) ఒకేసారి లాగిన్ అవ్వొచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల్లో లాగిన్ చేయొచ్చు.

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తనకు వచ్చిన కాల్స్ స్క్రీన్‌షాట్‌ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేశారు. ‘25 ఏళ్ల క్రితం ఎవరైనా నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందని, భారత క్రికెటర్‌గా నా కెరీర్ చివరి రోజు కాల్ లాగ్ ఇలా ఉంటుందని చెబితే, నాకు గుండెపోటు వచ్చి ఉండేది’ అని ఆయన ట్వీట్ చేశారు. సచిన్, కపిల్ దేవ్ లాంటి గొప్ప క్రికెటర్ల నుంచి కాల్ రావడం ఆశీర్వాదం అని ఆయన పేర్కొన్నారు.

రూపాయి నాణేలతో వాహనాలు కొనుగోలు చేశారనే వార్తలు కామన్. కానీ, TN కోయంబత్తూరుకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ తన భార్యకు ఇవ్వాల్సిన భరణంలో కొంత మొత్తాన్ని నాణేలతో చెల్లించేందుకు యత్నించి వార్తల్లోకెక్కాడు. కోర్టుకు అతను 20 బ్యాగుల్లో రుపాయి నాణేలు తీసుకొచ్చారు. అతని భార్య విడాకుల కోసం కోర్టుకెళ్లగా రూ.2లక్షలు భరణం చెల్లించాలని ఆదేశించింది. వాటిలో రూ.80వేలు నాణేలతో చెల్లించాలనుకుంటే కోర్టు అనుమతించలేదు.

స్పిన్నర్ అశ్విన్ బాటలోనే రోహిత్, కోహ్లీ, జడేజా కూడా రిటైర్మెంట్ బాట పట్టనున్నారా? టీమ్ ఇండియాలో సీనియర్ స్టార్లు వచ్చే ఏడాది జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోపు అంతర్జాతీయ కెరీర్‌కు తెరదించే అవకాశం ఉందని ‘క్రిక్‌బజ్’ ఓ కథనంలో తెలిపింది. ‘అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్లు తమ కెరీర్లను ముగించే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది నుంచి భారత జట్టు పూర్తి కొత్తగా కనిపించనుంది’ అని స్పష్టం చేసింది.

AP: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. కేంద్రం కోరినట్లు రూ.6,800 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్‌తో సహా 29ఏళ్ల మెచ్యూరిటీతో రుణం ఇస్తున్నట్లు చెప్పింది. జపాన్ కరెన్సీలో రుణం పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రస్తుతం అమరావతిలో లక్ష మంది నివసిస్తున్నట్లు వివరించింది. దశాబ్దంలోపు ఇక్కడ జనాభా అనేక రెట్లు పెరుగుతుందని తెలిపింది.

స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు అల్లాడుతున్నారు. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ 100 Pts ఎగిసి 24065 వద్ద గరిష్ఠాన్ని తాకింది. వెంటనే 60 Pts మేర నష్టాల్లోకి జారుకుంది. ఆపై పుంజుకొని రేంజుబౌండ్లో కొనసాగింది. మళ్లీ నేలవైపు పరుగులుపెట్టింది. ప్రస్తుతం 250 Pts నష్టంతో 23710 వద్ద ట్రేడవుతోంది. 1000 Pts మేర పడ్డ సెన్సెక్స్ 850 Pts నష్టంతో 78,367 వద్ద కొనసాగుతోంది.

TG: ధరణిలో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. ‘ధరణి పేరుతో కొల్లగొట్టిన ఆస్తులను పేదలకు పంచుతాం. దొరల స్వార్థానికి దాన్ని తీసుకొచ్చారు. ప్రతిపక్ష నేత కనిపించరు.. సభకు రారు. BRS నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. స్పీకర్‌పై పుస్తకాలు విసిరారు. KCR రాష్ట్రానికి కాపలా కుక్కలా లేరు. వేటకుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారు’ అని పొంగులేటి ఆరోపించారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ కన్నా రభసే ఎక్కువగా జరిగింది. NDA, INDIA పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. మొదట అదానీ అంశంపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. సొరోస్‌తో సోనియా, రాహుల్ సంబంధాలతో BJP దాన్ని తిప్పికొట్టింది. రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అమిత్ షా ప్రసంగాన్ని ట్రిమ్ చేసి కాంగ్రెస్ రచ్చ మొదలెట్టింది. కాదు మీరే బాబాసాహెబ్‌ను అవమానించారని BJP ఎదురుదాడికి దిగింది. ఇక MPల తోపులాట ఓ కొసమెరుపు!

హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘పుష్ప-2’కు PVR INOX షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో షోలను రద్దు చేసేందుకు PVR సిద్ధమైనట్లు సమాచారం. ‘బేబీ జాన్’ ఈనెల 25న విడుదల నేపథ్యంలో 50-50 షోస్‌ను ‘పుష్ప-2’ డిస్ట్రిబ్యూటర్ కోరడంతో థియేటర్ల పంపిణీలో గొడవ తలెత్తింది. మేకర్స్ దీనిపై చర్చలు జరపడంతో ఉదయం నుంచి కొన్నిచోట్ల షోలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. ఈనెల 25 తర్వాత షోలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఆందోళనల మధ్యే కొనసాగుతోంది. ‘భూభారతి’పై ఒకవైపు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై చర్చకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.