News December 19, 2024

మా డ్రీమ్ ఐకాన్ ఆశీర్వాదం లభించింది: కీర్తి

image

స్టార్ హీరోయిన్ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరవడం కామన్. కానీ, కీర్తి సురేశ్ వివాహానికి దళపతి విజయ్ మాత్రమే వచ్చారు. విజయ్‌కు కీర్తి పెద్ద అభిమాని కావడమే ఇందుకు కారణం. కీర్తి కోరిక మేరకు ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్‌తో దిగిన ఫొటోను కీర్తి షేర్ చేశారు. పెళ్లిలో తమ డ్రీమ్ ఐకాన్ నుంచి ఆశీర్వాదం లభించిందంటూ విజయ్ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

News December 19, 2024

ముగిసిన క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. మూడు గంటలకు పైగా జరిగిన సమావేశంలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

News December 19, 2024

న‌న్ను తోసేశారు.. మోకాలికి గాయ‌మైంది: ఖ‌ర్గే

image

పార్ల‌మెంటు అవ‌ర‌ణ‌లో నిర‌స‌న తెలుపుతున్న త‌న‌ను BJP MPలు తోయ‌డంతో మోకాలికి గాయ‌మైన‌ట్టు ఖ‌ర్గే ఆరోపించారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఆయ‌న లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ రాశారు. ఇది త‌న‌పై జ‌రిగిన వ్య‌క్తిగ‌త దాడి మాత్ర‌మే కాద‌ని, రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత హోదాపై జ‌రిగిన దాడ‌ని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు తోయ‌డం వ‌ల్లే కింద ప‌డిపోయాన‌ని, ఇది వ‌ర‌కే స‌ర్జ‌రీ జ‌రిగిన మోకాలికి గాయ‌మైంద‌న్నారు.

News December 19, 2024

ఎంపీల ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాని ఆరా

image

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో అధికార‌, విప‌క్ష ఎంపీల పోటాపోటీ నిర‌స‌న‌ల మ‌ధ్య చోటుచేసుకున్న తోపులాట‌లో గాయ‌ప‌డిన బీజేపీ ఎంపీల ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోదీ ఆరా తీశారు. ఘ‌ట‌న‌కు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయ‌గా, ఆయ‌న త‌న మీద‌ప‌డ‌డంతో బలమైన గాయమైనట్టు MP ప్ర‌తాప్ ఇదివ‌ర‌కే ఆరోపించారు. బీజేపీ ఎంపీలు అడ్డుకోవ‌డం వ‌ల్లే అలా జ‌రిగిందంటూ తరువాత రాహుల్ వివ‌ర‌ణ ఇచ్చారు.

News December 19, 2024

రాహుల్ గాంధీకి KTR లేఖ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. అదానీ వ్యవహారంలో ప్రజలకు సమాధానం చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అదానీపై పోరాటం చేస్తోందా? లేక ప్రజలను మోసం చేస్తోందా? అని ప్రశ్నించారు. అదానీతో పోరాటం అని ఢిల్లీలో మీరు అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం దోస్తీ చేస్తోందని ఆరోపించారు.

News December 19, 2024

ఆయన ఆలోచనా పునాదుల మీదే నవ భారతం: కమల్ హాసన్

image

అంబేడ్క‌ర్ ఆలోచనా పునాదుల మీదే న‌వ భార‌తం నిర్మిత‌మ‌వుతోంద‌ని క‌మ‌ల్ హాస‌న్ పేర్కొన్నారు. విదేశీ అణ‌చివేత నుంచి దేశానికి గాంధీ విముక్తి క‌ల్పించ‌గా, సామాజిక అన్యాయాల నుంచి అంబేడ్క‌ర్ విముక్తి క‌ల్పించార‌న్నారు. స్వేచ్ఛా భార‌తావ‌ని కోసం అంబేడ్క‌ర్ దార్శ‌నిక‌త‌తో ప‌నిచేస్తున్న ప్ర‌తి పౌరుడు ఆయ‌న వార‌స‌త్వాన్ని హ‌న‌నం చేసే చ‌ర్య‌ల‌ను అంగీక‌రించ‌బోరని అమిత్ షా వ్యాఖ్యలపై కమల్ పరోక్షంగా స్పందించారు.

News December 19, 2024

BITCOIN విలవిల: 24 గంటల్లో Rs 5లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా $5929 (Rs 5L) నష్టపోయింది. $106524 వద్ద గరిష్ఠాన్ని తాకిన BTC $100000 వద్ద కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 100204 వద్ద ముగిసింది. నేడు $1371 లాభపడి $101632 వద్ద ట్రేడవుతోంది. ఎథీరియమ్ 4.13% పతనమై $3609 వద్ద కొనసాగుతోంది. ఇక XRP 5.46, SOL 2.01, BNB 1.66, DOGE 5.50, ADA 3.19, AVAX 7.59, LINK 8.73, SHIB 5.97% మేర నష్టపోయాయి.

News December 19, 2024

INSTAGRAMలో అదిరిపోయే ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మీరు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. 29 రోజుల ముందే షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూజర్ల నుంచి వచ్చిన రిక్వెస్టులతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా మంది బర్త్ డే విషెస్ మెసేజ్‌లు పంపించేందుకు అర్ధరాత్రి వరకూ వేచి ఉంటుంటారు. ఈ ఫీచర్‌తో ఇకపై షెడ్యూల్ చేసి విషెస్‌ను పంపించవచ్చు.

News December 19, 2024

దారుణం: 2 వేర్వేరు ప్రమాదాల్లో 52మంది దుర్మరణం

image

అఫ్గానిస్థాన్‌లో విషాదం నెలకొంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 52మంది మృతిచెందారు. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. గజిని రాష్ట్రంలోని కాబూల్, కాందహార్ హైవేపై బుధవారం ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. షాబాజ్ గ్రామంలో ఫ్యూయల్ ట్యాంకర్‌, అందార్ జిల్లాలో ట్రక్కును బస్సులు ఢీకొన్నాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అంతర్యుద్ధాలతో సతమతమైన అఫ్గాన్‌లో రోడ్లు అస్సలు బాగుండవు.

News December 19, 2024

థియేటర్లు షేక్ అవుతాయి: గేమ్ ఛేంజర్ టీమ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. డైరెక్టర్ శంకర్‌తో, కీలక పాత్రలో నటిస్తోన్న SJ సూర్యతో చరణ్ ఉన్న ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 10న థియేటర్లు షేక్ అవుతాయంటూ పేర్కొన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.