News September 21, 2024

లిఫ్ట్‌లకు నో చెప్పి రోజూ మెట్లు ఎక్కితే..

image

కాళ్లకు పనిచెప్పకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం పెరిగింది. అయితే రోజూ మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తొడ కండరాలు, పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుందని, చక్కటి శరీరాకృతి వస్తుందని పేర్కొంటున్నారు. వేగంగా కాకుండా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కాలంటున్నారు. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాలు, మడమ, కీళ్ల నొప్పులు ఉన్నవారు మెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News September 21, 2024

ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రి పొంగులేటి భేటీ

image

TG: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. మ.2గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి రెవెన్యూ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. వీఆర్‌వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

News September 21, 2024

అక్కినేని ఫ్యామిలీ PHOTO

image

ANR శతజయంతి వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగేశ్వరరావు ఇద్దరు కొడుకులు వెంకట్, నాగార్జున, ముగ్గురు కూతుళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఒకే వేదికపై కనిపించారు. హీరోలు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

News September 21, 2024

బర్త్ డే రోజు బెస్ట్ ఫిగర్స్.. రఫ్ఫాడించిన రషీద్

image

అఫ్గాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించారు. పుట్టినరోజున వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్(9-1-19-5) నమోదుచేసిన క్రికెటర్‌గా నిలిచారు. 2007లో ఫిలాండర్(12 పరుగులకు 4 వికెట్లు)VS ఐర్లాండ్, 2010లో స్టువర్ట్ బ్రాడ్(44కు 4 వికెట్లు)VS ఆసీస్ బర్త్ డే రోజున అదరగొట్టారు. కాగా నిన్న మ్యాచ్ అనంతరం రషీద్ పిచ్‌కు ముద్దు పెట్టి ఎమోషనల్ అయ్యారు.

News September 21, 2024

చెత్త పన్ను వసూలు చేయొద్దని సీఎం ఆదేశం?

image

AP: నగరాలు, పట్టణాల్లో చెత్త పన్నును వసూలు చేయొద్దని CM చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఇకపై వసూలు చేయొద్దు’ అని అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మున్సిపాలిటీలే భరించాలని చెప్పినట్లు పేర్కొన్నాయి.

News September 21, 2024

కోర్టు తీర్పులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త: SC

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో BRS MLC కవితకు బెయిల్ రావడంపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి స్పందించింది. రేవంత్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లాలని తాము అనుకోవట్లేదని పేర్కొంది. కోర్టులు జారీ చేసిన ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News September 21, 2024

కొత్త మద్యం షాపులు.. దరఖాస్తుల ద్వారానే రూ.400 కోట్ల ఆదాయం

image

AP: నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేట్ లిక్కర్ షాపులకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,736 దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటికి నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుం రూ.2లక్షలుగా నిర్ధారించారు. దాదాపు 15-20వేల అప్లికేషన్లు రావొచ్చని అంచనా. అలాగే 12 ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ స్టోర్లకు భారీగా ఫీజు ఉంటుంది. మొత్తంగా దరఖాస్తుల ద్వారానే రూ.300-400 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా.

News September 21, 2024

లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక

image

ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.

News September 21, 2024

చరిత్ర సృష్టించిన అఫ్గాన్

image

రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.

News September 21, 2024

రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు

image

ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.