India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గురుగ్రామ్‌లో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు వ్యక్తి మృతికి కారణమవ్వడంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘటనలో బైకర్ మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అతని కారుపై BJP స్టిక్కర్ ఉండడమే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టికర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిపడింది.
AP: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22తో బదిలీల ప్రక్రియ గడువు ముగియనుంది. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సర్కార్ చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఉద్యోగులను వారి స్థానాల నుంచి రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను GOVT ఆదేశించింది.
AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
బాటిల్‌పై కేలరీల లేబుల్ ఉంచితే మందుబాబులు మద్యం సేవించే మోతాదును తగ్గించుకొనే అవకాశం ఉందని ఇంగ్లండ్‌లో జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. 4,684 మంది పెద్దలపై UCL పరిశోధకులు అధ్యయనం జరిపారు. దీని ప్రకారం బాటిళ్లపై కేలరీల లేబుల్‌లను జోడిస్తే, సగం కంటే ఎక్కువ మంది మద్యం ప్రియులు తమ మద్యపాన అలవాట్లను మార్చుకుంటారని కనుగొన్నారు. సేవించే మోతాదు ఎంతున్నా తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారన్నారు.
భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.
AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.
AP: తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రసాదం నాణ్యతపై వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ‘బాలాజీ’ ఆరాధ్య దేవుడు. ఈ ఆరోపణలు ప్రతి ఒక్క భక్తుడిని బాధిస్తున్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. మన దేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలి’ అని Xలో ట్వీట్ చేశారు.
అర్ధరాత్రి రోడ్డుపై వెంబడించిన ఆగంతకులపై కేసు పెట్టడానికి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి, అతనికి కాబోయే భార్య పోలీస్ స్టేషన్‌లోనే వేధింపులు ఎదుర్కొన్నారు. భువనేశ్వర్‌లోని భరత్‌పూర్ స్టేషన్ పోలీసు అధికారులు తన బట్టలు చింపి, కాళ్లు, చేతులు కట్టేసి లైంగికంగా-శారీరకంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటనలో తాజాగా ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్ చేశారు.
ఇంగ్లండ్ క్రికెట్ స్వలింగ సంపర్క జంట నాట్ సివర్, కాథరిన్ తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించారు. క్యాథరిన్(39) గర్భం దాల్చినట్లు నాట్ ఇన్‌స్టాలో తెలిపారు. క్యాథరిన్ గత ఏడాది రిటైర్ కాగా నాట్ ఇంకా ఆడుతున్నారు. వీరిద్దరూ 2022 మేలో పెళ్లి చేసుకున్నారు. క్యాథరిన్ వయసు ఎక్కువ కావడంతో వారు ఆమె అండాల్ని భద్రపరిచారు. ఇప్పుడు వాటి ద్వారా అందుబాటులో ఉన్న పద్ధతుల్ని అనుసరించి వారు పేరెంట్స్ కాబోతున్నారు.
తమకు 50 మిలియన్ డాలర్ల బడ్జెటరీ సపోర్ట్ అందించిన భారత్‌కు, ప్రధాని మోదీకి మాల్దీవుల ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ‘ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి వైపుగా మన ప్రయాణాన్ని బలపరుస్తుంది’ అని ఆ దేశ పర్యాటక మంత్రి ట్వీట్ చేశారు. మాల్దీవుల్లో చైనా అనుకూల ముయిజ్జు సర్కారు వచ్చినప్పటికీ భారత్ సపోర్ట్ ఇస్తుండటం విశేషం.
Sorry, no posts matched your criteria.