India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
US ఎన్నికలకు AI కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఓపెన్‌ఏఐ, గూగుల్ జనరేటివ్ AIలు పబ్లిక్ ఫిగర్‌లను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్‌ల సృష్టికి దారితీస్తున్నాయి. ఇటీవల అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తనకు మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్న ఫొటోను ట్రంప్ షేర్ చేశారు. అయితే, తర్వాత ఆమె కమలకే తన మద్దతు అని ప్రకటించారు. ఈ సమస్యలను నివారించడానికి కాలిఫోర్నియా అప్పడే చట్టాలు తీసుకొచ్చింది.
TG: కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఖరీఫ్ నుంచే సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. చెన్నై టెస్టులో అరగంట ఎక్కువ కేటాయించినప్పటికీ బంగ్లా కేవలం 80 ఓవర్లు మాత్రమే వేసింది. ఐసీసీ నియమావళి ప్రకారం.. రౌండ్ స్టేజీలో ఒక్కో పెనాల్టీ ఓవర్‌కు ఒక పాయింట్ తగ్గిస్తారు. ఈ మ్యాచ్ అనంతరం అది జరిగితే బంగ్లా టెస్టు ఛాంపియన్‌షిప్ ముప్పులో పడినట్లే. గత నెలలోనే ఆ జట్టు 3 పాయింట్లను కోల్పోవడంతో పాటు 15శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదుర్కొంది.
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ISSలో తన 59వ పుట్టినరోజు జరుపుకున్నారు. రోదసిలో ఇది ఆమెకు రెండో బర్త్‌డే కావడం విశేషం. బోయింగ్ స్టార్‌లైనర్ లోపం కారణంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. 2006, 2012లో రోదసిలోకి వెళ్లిన ఆమెకు ఇది మూడో పర్యటన. సునీత క్షేమంగా భూమికి తిరిగిరావాలని ఆమె అభిమానులు నెట్టింట విష్ చేస్తున్నారు.
వెట్టయాన్ ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీలో ఆయన పాత్ర ఏంటన్నది మూవీ టీమ్ వెల్లడించింది. ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ఆయన పని విధానం నచ్చని బాస్‌గా అమితాబ్ నటించారు. బిగ్ బీకి ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. జైభీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.
TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్యవహారాలు పర్యవేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజలకు, దీపాలకు, అన్న ప్రసాదాలకు నందిని నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
TG: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్‌టీఎల్ పరిధి 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత రికార్డుల్లో అది 65 ఎకరాలుగా ఉందని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.