India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వీసా లేకుండానే భారతీయులు రష్యాలో పర్యటించే అవకాశం త్వరలోనే రానుంది. అక్కడ పర్యటించే ఇండియన్స్ సంఖ్య పెరుగుతుండటంతో వీసా ఫ్రీ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏ పనిపై వచ్చారన్న సమాచారం ఆధారంగా వీసాలు మంజూరు చేస్తారు. భారతీయుల విషయంలో వీసా రూల్స్ సడలించాలని జూన్‌లో భారత్-రష్యా అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం టూరిస్ట్, బిజినెస్, ఉద్యోగం, స్టూడెంట్ సహా పలు రకాల వీసాలున్నా, వీటి మంజూరుకు సమయం పడుతుంది.

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా నిలిచిపోయింది. వర్షం మొదలయ్యే సమయానికి టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. పంత్ 9 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. క్రీజులో రాహుల్(30*), రోహిత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 397 పరుగులు వెనుకబడి ఉంది.

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడ్ మీటింగ్, గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిఫ్టీ 24,699 (-70), సెన్సెక్స్ 81,874 (-252) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు, IT, ఆటో, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. INDUSIND, SRIRAM FIN, CIPLA, RIL, BAJAJ FIN టాప్ గెయినర్స్. JSW స్టీల్, TITAN, APOLLOHOSP, TCS టాప్ లూజర్స్.

TG: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్ల కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ పరిధిలో బర్త్, డెత్, మ్యారేజ్, హౌజ్ పర్మిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లే ఔట్ పర్మిషన్ వంటి 20 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందించేలా ‘మై-పంచాయతీ’ యాప్‌ను రూపొందిస్తోంది. గ్రామ సమస్యలపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం.

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్మించిన ఇళ్లకు సున్నాలు వేసి ఇందిరమ్మ ఇళ్లని కాంగ్రెస్ నేతలు ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం రేవంత్ తరం కాదన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందివ్వడం కేసీఆర్ కల అని పేర్కొన్నారు. ఎన్నాళ్లైనా ఆ నిర్మాణాలకు మీరంతా సున్నాలు వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.

‘INDIA’లో ఐక్యతకు బీటలు వారుతున్నాయి. కాంగ్రెస్, రాహుల్‌పై మిత్రపక్షాలు విశ్వాసం కోల్పోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటి వరకు నాయకత్వం మమతకు విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయని, ఇప్పుడు EVMలపై ఆ పార్టీ వైఖరిని ఖండిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఓటింగ్ యంత్రాలపై ఇకనైనా నసుగుడు ఆపాలని JK CM <<14888698>>ఒమర్<<>> అబ్దుల్లా అనడాన్ని ఉదహరిస్తున్నాయి. కాంగ్రెస్‌పై మిత్రపక్షాల విమర్శలు చేటు చేస్తాయనడంపై మీ కామెంట్.

BIGGBOSS-8 విజేతగా నిలిచిన నటుడు <<14890791>>నిఖిల్ మలియక్కల్ <<>>మైసూర్(KA)లో జన్మించారు. తల్లి నటి, తండ్రి జర్నలిస్టు కావడంతో చిన్నప్పటి నుంచి డాన్స్, సినిమాలపై ఆసక్తి కలిగింది. నటనపై ఇష్టంతో ఉద్యోగం వదిలేశారు. 2016లో ఊటి చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్‌మాలో వచ్చే గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్‌తో తెలుగు వారిని అలరించారు.

న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే వేదికపై టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటివరకు విలియమ్సన్ టెస్టుల్లో 33 సెంచరీలు చేశారు.

TG: రాష్ట్ర అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని KTR ట్వీట్ చేశారు. 2024 మార్చి నాటికి తెలంగాణ రుణాలు రూ.3.89 లక్షల కోట్లకు చేరాయని RBI పేర్కొంటే ఆర్థిక మంత్రి రూ.7 లక్షల కోట్లని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ గత BRS ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారని దుయ్యబట్టారు.

TG: రైతు భరోసాకు తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాలు లిమిట్ పెట్టాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో చాలా మంది పరిమితి పెట్టాలని సూచించారని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, IAS, IPSలకు రైతు భరోసా ఇవ్వకూడదని తెలిపింది. దీనిపై అసెంబ్లీలో, క్యాబినెట్ భేటీలో చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ పథకం కింద సీజన్‌కు ఎకరాకు ₹7,500 ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.