India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రిప్టో కాయిన్లు తగ్గేదే లే అంటున్నాయి. గత 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేశాయి. నేడు బిట్‌కాయిన్ $1,06,648 (Rs 90L) జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. $1,04,463 వద్ద మొదలైన BTC $1,04,324 వద్ద కనిష్ఠాన్ని తాకింది. $823 లాభంతో $1,05,287 వద్ద చలిస్తోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ మళ్లీ $4000 స్థాయిని టచ్ చేసింది. లాభాల స్వీకరణతో USDT, XRP, SOL, BNB, DOGE, USDC, ADA, TRX, SHIB నష్టాల్లో ఉన్నాయి.

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మ.2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టం ROR బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం. అలాగే రైతు భరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. MPగా ఉన్న BC నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నా, కొత్త నేతకూ ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే MLAలు, MPలు, సీనియర్ నేతల అభిప్రాయాన్ని అధిష్ఠానం సేకరించింది. ధర్మపురి అర్వింద్, ఈటల, DK అరుణ, రఘునందన్, ఎన్.రాంచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై రేంజుబౌండ్లో కదలాడే అవకాశముంది. ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. జపాన్, తైవాన్ సూచీలు ఎగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గాయి. US FED, BOE, BOJ ద్రవ్య పరపతి సమీక్షలు, US GDP, IPOపై సూచీల గమనం ఆధారపడి ఉంది. నిఫ్టీ రెసిస్టెన్సీ 24,814, సపోర్టు 24,347 వద్ద ఉన్నాయి. STOCKS 2 WATCH: BIOCON, RIL, GMMP, GE POWER, 63MOONS, LUPIN, AURO PHARMA, JSW ENERGY, JKPAPER, HERO

భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఫీట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై 50 టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచారు. 51 వికెట్లతో కపిల్ దేవ్ తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కుంబ్లే(49), అశ్విన్(40), బిషన్ సింగ్ బేడి(35) ఉన్నారు.

రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్ కేటాయించగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో హెడ్ (152), స్మిత్ (101), క్యారీ (70) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 6, సిరాజ్ 2, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ తలో వికెట్ తీశారు.

TG: పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ను అందించే టీసాట్ ఇకపై వ్యవసాయ ప్రసారాలనూ అందిస్తుందని ఆ సంస్థ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్‌లో ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రసారాలుంటాయని తెలిపారు. మంగళవారం సా.4 నుంచి 5 గంటల వరకు హార్టికల్చర్ అంశాలు ప్రసారం చేస్తామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అనుభవమున్న రైతులు సలహాలు ఇస్తారని పేర్కొన్నారు.

బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 435/8గా ఉంది. క్యారీ (64), లియోన్ (0) నాటౌట్‌గా నిలిచారు. బుమ్రా 6 వికెట్లు పడగొట్టారు.

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Sorry, no posts matched your criteria.