India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WPL వేలంలో భారత యంగ్ ప్లేయర్లు సిమ్రాన్ షేక్, కమలిని జాక్ పాట్ కొట్టేశారు. ఇవాళ్టి వేలంలో సిమ్రాన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు కమలినిని రూ.1.6 కోట్లకు ముంబై దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన సిమ్రాన్ బ్యాటర్ కాగా 16 ఏళ్ల కమలిని వికెట్ కీపర్, బ్యాటర్ కావడం గమనార్హం. 23 ఏళ్ల ప్రేమ్ రావత్‌ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సిమ్రాన్ అత్యధిక ధర పలికారు.

EVMల ట్యాంపరింగ్‌పై INDIA కూటమి చేస్తున్న విమర్శల నుంచి NC దూరం జరిగింది. ఆశించిన ఫలితాలు రానప్పుడు EVMలను నిందించడం తగదని JK CM ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. LS ఎన్నికల్లో 100 సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని, కొన్ని నెలలకే అనుకూల ఫలితాలు రాలేదని ఈవీఎంలపై మాట మార్చడం సరికాదన్నారు. ఈ విషయంలో తన వైఖరి బీజేపీ వాదనకు వత్తాసుపలకడం కాదన్నారు. వాస్తవాన్ని చెప్పానన్నారు.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుతో APలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. ‘ఆయన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఒక పూట తినకపోతేనే మనం తట్టుకోలేం. కానీ 58 రోజులు నిరాహార దీక్ష చేసి, అమరజీవి అయిన ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఆయన త్యాగం స్మరించుకునేలా HYDలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. NLR జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం’ అని CM గుర్తుచేశారు.

అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 10 రోజుల్లోనే హిందీలో రూ.507.50 కోట్లు కలెక్ట్ చేసి, అత్యంత వేగంగా 500Cr క్లబ్‌లోకి అడుగుపెట్టిన మూవీగా నిలిచింది. దీంతో పుష్ప యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి, అతి తక్కువ టైంలో ఈ రికార్డు సాధించిన సినిమాగా నిలిచింది.

WPL వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియాC తరఫున ఆడారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం.

తాజ్‌మహల్ కట్టినవారి చేతుల్ని అప్పటి పాలకులు నరికితే.. రామమందిర కార్మికుల్ని బీజేపీ సర్కారు గౌరవించుకుందని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘గుడిని నిర్మించిన కార్మికులపై రామమందిర ప్రారంభం రోజున ప్రధాని పూల వర్షం కురిపించారు. ఒకప్పటి పాలకులు తాజ్ మహల్ నిర్మాణ, వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతులు నరికారు. నైపుణ్యాన్ని అంతం చేశారు. నేడు భారత్ కార్మిక శక్తిని కాపాడుకుంటోంది’ అని పేర్కొన్నారు.

ఈరోజు నటి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త వరుణ్ తేజ్ ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే బేబీ. నువ్వు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను నా జీవితంలోకి తీసుకొచ్చావు. నీతో ఉండే ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం మరింత అందంగా మారుతోంది. లవ్ యూ. అన్నట్లు.. నన్ను డ్యాన్స్ చేయించగలిగే ఏకైక వ్యక్తి నువ్వే’ అని పేర్కొన్నారు.

US నుంచి అనధికార నివాసితులను తిప్పిపంపడంపై ట్రంప్ కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రాలవారీగా అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో 14 లక్షల మంది అనధికార నివాసితులు ఉన్నట్టు అంచనాకొచ్చారు. వీరిలో 17,940 మంది భారతీయులు ఉండగా అత్యధికులు పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. హక్కులు పొందే న్యాయప్రక్రియ ఆలస్యవుతుండడంతో వీరిపై డిపార్టేషన్ కత్తివేలాడుతోంది.

TG: పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని, సీఎం రేవంత్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని KTR విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిలో ఉంటాయని Xలో ఓ <

TG: భూమిలేని నిరుపేద కుటుంబానికి రూ.12వేలు ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ‘ఏడాదికి 2 విడతల్లో డబ్బులు జమ చేస్తాం. డిసెంబర్ 28న తొలివిడత అందిస్తాం. రైతు భరోసా డబ్బులనూ సంక్రాంతి సమయంలో రైతులకు అందిస్తాం. రైతులకు రుణమాఫీ చేశాం. ఎకరానికి రూ.10వేలు పంట నష్ట పరిహారం చెల్లించాం. రైతు బీమా కూడా చెల్లిస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం’ అని భట్టి ఖమ్మంలో మీడియాతో చెప్పారు.
Sorry, no posts matched your criteria.