India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: డిసెంబర్ 15, ఆదివారం
పౌర్ణమి : మ.2.31 గంటలకు
మృగశిర: రా.2.19 గంటలకు
వర్జ్యం: ఉ.9.08-10.38 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.07-4.51 గంటల వరకు

* దేశానికి కాంగ్రెస్ అనేక విధాలుగా నష్టం కలిగించింది: PM మోదీ
* ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తాం: సీఎం చంద్రబాబు
* TG: 98 శాతం కులగణన పూర్తి: సీఎం రేవంత్
* విద్యార్థులకు కామన్ డైట్ మెనూ ప్రారంభించిన ప్రభుత్వం
* ద్రోణాచార్యుడిలా జాతి బొటనవేలిని కోసేస్తున్న BJP: రాహుల్
* జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. ప్రముఖుల పరామర్శ

‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని పేర్కొన్నారు. ఈనెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే.

సామాజిక అంశాలు, అభివృద్ధి పనుల కోసం దేశంలోని ధనికులు తమవంతుగా విరాళాలిస్తుంటారు. ఈ ఏడాది అత్యధికంగా శివ్ నాడార్ ₹2153 కోట్లు విరాళమిచ్చారు. ₹407 కోట్లు డొనేట్ చేసి ముకేశ్ ఫ్యామిలీ రెండో ప్లేస్‌లో ఉండగా ₹352 కోట్లతో బజాజ్ ఫ్యామిలీ మూడో స్థానంలో నిలిచింది. కుమార మంగళం బిర్లా ₹334 కోట్లు, గౌతమ్ అదానీ ₹330 కోట్లు, నందన్ నిలేకని ₹307 కోట్లు, అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ₹241కోట్లు డొనేట్ చేశాయి.

పని చేయలేకపోతే ఆ మాటే చెప్పి మానేయొచ్చు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మయూర్ తరపరా(32) అనే వ్యక్తికి మాత్రం దూరపు చుట్టమైన తన యజమానికి ఆ మాట చెప్పడానికి మొహమాటం అడ్డొచ్చింది. కంప్యూటర్ ఆపరేటర్‌గా చేయడం ఇష్టంలేక, యజమానికి చెప్పలేక.. తన ఎడమచేతి నాలుగు వేళ్లు నరికేసుకున్నాడు! ఎవరో దుండగులు తన వేళ్లు నరికేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మయూరే తన వేళ్లను నరికేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది.

తన తల్లి బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఆమెకోసం భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా. మన కుటుంబానికి హృదయానివి, ఆత్మవి నువ్వే. నీ ప్రేమ, దయ మమ్మల్ని ఎన్ని కష్టాలొచ్చినా కలిపి ఉంచింది. నీ ధైర్యం నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంటుంది. ప్రపంచంలోని శాంతి, సంతోషం, ప్రేమ అంతా నీకు దక్కాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా ఎప్పుడూ నీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల్లో ఒకే తేదీన పుట్టిన వారు ఇద్దరూ లేకుంటే ముగ్గురుండటమే అరుదు. కానీ, ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఒకే తేదీన జన్మించారు. పాకిస్థాన్‌కి చెందిన మాంగి కుటుంబంలో అమీర్ అలీ, అతని భార్య కుడేజాతో పాటు ఏడుగురు పిల్లలు ఆగస్టు 1న జన్మించారు. ఇలాంటి కుటుంబం ప్రపంచంలో ఒక్కటి మాత్రమే ఉండటంతో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

పారాసెటమాల్‌ను ఎక్కువగా వాడటం ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరానికి వాడే ఈ ఔషధాన్ని వృద్ధుల్లో కీళ్లనొప్పులకు కూడా వైద్యులు సిఫారసు చేస్తుంటారు. దీర్ఘకాలంలో ఇది అంత మంచిది కాదని UKలోని నాటింగ్‌హామ్ పరిశోధకులు చెబుతున్నారు. 65ఏళ్లకు పైబడిన 1.80లక్షలమందిపై అధ్యయనం చేశామని, పారాసెటమాల్ వలన వృద్ధుల్లో కిడ్నీ, గుండె, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయని గుర్తించామని పేర్కొన్నారు.

AP: నందమూరి లక్ష్మీ పార్వతికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ చీఫ్ జగన్ ఆదేశాలతో ఆమెను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రో కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 36-32 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 12 పాయింట్లు సాధించారు. ప్రస్తుతం TT పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉన్న హరియాణా స్టీలర్స్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయింది.
Sorry, no posts matched your criteria.