News June 9, 2024

మోదీ కెప్టెన్‌గా జంబో టీమ్

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ కొలువుదీరింది. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా ఐదుగురు సహాయ(స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మోదీ టీమ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కింది.

News June 9, 2024

బాబు రాకతో భూముల ధరలకు రెక్కలు?

image

AP: మరోసారి టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎం అవుతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలైనట్లు టాక్. కాగా గత ఐదేళ్లుగా అమరావతిలో వివిధ నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. బాబు ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టబోతుండటంతో అమరావతికి పునరుజ్జీవనం వచ్చినట్లు తెలుస్తోంది.

News June 9, 2024

మోదీకి బిల్ గేట్స్ అభినందనలు

image

భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి దిగ్గజ వ్యాపార‌వేత్త బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేశారని కొనియాడారు. ప్రపంచంతో పాటు భారత్‌లోని ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

News June 9, 2024

భారత్‌కు షాక్.. ఓపెనర్లు ఔట్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచులో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. 19 పరుగులకే ఓపెనర్లు రోహిత్(13), కోహ్లీ(4) వికెట్లను కోల్పోయింది. అఫ్రీది, నసీమ్ తలో వికెట్ తీశారు.

News June 9, 2024

ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

image

రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగించింది.

News June 9, 2024

విరాట్, రోహిత్ ఆటోగ్రాఫ్ తీసుకున్న గేల్

image

విండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్ న్యూయార్క్‌లోని భారత్, పాక్ మ్యాచ్ వేదికలో సందడి చేశారు. భారత్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపేలా త్రివర్ణాలతో ఉన్న కోట్‌ను ఆయన ధరించారు. ఈ క్రమంలో మైదానంలో తిరుగుతూ భారత కెప్టెన్ రోహిత్, కోహ్లీతో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

News June 9, 2024

ఒక్క ఓవర్ పడగానే మళ్లీ వర్షం

image

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం పదేపదే అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికే వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ పడగానే మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో మ్యాచ్ ఆగిపోయింది.

News June 9, 2024

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

image

వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జగన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

News June 9, 2024

పవన్ వస్తారు.. సంయమనం పాటించండి: నాగబాబు

image

AP: వారంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని.. అప్పటివరకు జనసైనికులు సంయమనం పాటించాలని ఆ పార్టీ నేత నాగబాబు కోరారు. ‘వన్నెపూడి ఘటన ఉదంతం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనలో జనసైనికులు పాల్గొన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. తాటిపర్తి ఘటనపై కూడా మాకు సమాచారం ఉంది. పవన్ ఎన్డీఏలో కీలకభూమిక పోషిస్తున్న తరుణంలో ఆయన చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News June 9, 2024

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరింత ఆలస్యం

image

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. న్యూయర్క్‌లోని స్టేడియం వద్ద వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో మ్యాచ్‌ను రా.8.50 గంటలకు ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. పూర్తి ఓవర్ల మ్యాచ్ జరగనుంది. కాగా పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.