India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!

TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.4, నిజామాబాద్‌లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తొలుత జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. బన్నీని కలిసేందుకు నిర్మాత దిల్ రాజు సహా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపు అర్జున్ ఆఫీస్‌లోనే ఉండనున్నారు. అనంతరం నివాసానికి వెళ్తారు. అక్కడికి అభిమానులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బ్రిస్బేన్ టెస్టును వరుణుడు అడ్డుకుంటున్నాడు. వర్షం వల్ల రెండు సార్లు ఆట నిలిచిపోయింది. తొలిసారి 5వ ఓవర్లో జల్లులు పడగా ఆటను అంపైర్లు కొద్దిసేపు ఆపేశారు. తిరిగి కాసేపటికి ఆట ప్రారంభం కాగా, 13వ ఓవర్ జరుగుతుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో మరోసారి గేమ్ నిలిచిపోయింది. ప్రస్తుతం స్కోర్ AUS 28/0గా ఉంది. బ్రిస్బేన్‌లో శనివారం నుంచి సోమవారం వరకు వర్షాలు పడతాయని ఆ దేశ వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ MP పుట్టా మహేశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఏపీ హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.

AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

చంచల్‌గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 5.3 ఓవర్లలో 19/0 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్‌స్వీనీ (2) ఉన్నారు.

కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్, బన్నీ తరఫు లాయర్లు ఉదయాన్నే జైలు వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారనే సమాచారం మేరకు పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. బెయిల్ వచ్చినప్పటికీ పలు కారణాలతో బన్నీ రాత్రంతా జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.