India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా ఆయన సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం మాజీ ప్రధాని వాజ్‌పేయీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. కాగా రాత్రి 7.15 గంటలకు మోదీ పీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీఎంవో అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్నామలై ఓటమిపాలైనా రాష్ట్రాధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. గతంలో 3 శాతం మేర ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్‌ను 11 శాతానికి చేర్చారు. దీంతోనే ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి PMO నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు నితిన్ గడ్కరీ, మేఘ్‌వాల్, శర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, షిండే వర్గం శివసేన నేత ప్రతాప్ రావ్ జాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్ కాల్స్ వచ్చాయి. నేడు వీరంతా ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఈ నెల 14న OTTలోకి వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ మూవీ మే 31న విడుదలై 14 రోజుల్లోనే OTTలోకి రావడం గమనార్హం. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు.
AP: ట్విటర్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రొఫైల్ పిక్ మారింది. మొన్నటి వరకు ఉన్న వైఎస్ జగన్ ఫొటోను అధికారులు తొలగించారు. కాబోయే సీఎం చంద్రబాబు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్‌గా మార్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండటంతో ఏపీ సీఎంఓ ట్విటర్‌లో ఈ మార్పులు చేసింది. మార్పుల అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారంపైనే తొలి పోస్ట్ పెట్టారు.
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబుకి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫోన్లో అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన Xలో వెల్లడించారు. రాజకీయంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి చంద్రబాబుతో తనకు అనుబంధం ఉందని రాసుకొచ్చారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు నవీన్ పేర్కొన్నారు.
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మహిళల్లో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ టాప్ ర్యాంకు సాధించారు. ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <
TDP మద్దతుతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ సమయాల్లో ఉత్తరాంధ్రకు ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. 1996లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడుకి అవకాశం ఇచ్చింది. 2014 NDA సర్కారులో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖా మంత్రిగా పని చేశారు. తాజాగా మోదీ 3.0 ప్రభుత్వంలో శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది.
AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 లక్షలు(57.10%), YCPకి 1.41 లక్షలు(28.11%), ఇండియా కూటమికి 30,386(6.05%) ఓట్లు దక్కాయి. దీన్నిబట్టి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలకు నమోదైన పోస్టల్ ఓట్ వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్ టాపర్ అని, 11వ తరగతిలో ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యానని తెలిపారు. ఇప్పటివరకు లైఫ్‌లో అదే తన తొలి, చివరి ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూనే UPSC పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.