India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్‌కు కూడా గడువు ముగిసింది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఎంపీగా పదవిలో ఉండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడి దయ వల్ల అది జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 38 ఏళ్ల కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి టెస్టు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులోనే భారత్‌పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.
వచ్చే సీజన్‌లో సరికొత్త పంజాబ్ కింగ్స్ టీమ్‌ను చూపేందుకు ప్రయత్నిస్తానని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ‘పంజాబ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ‘పాంటింగ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా జట్టును పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఆయన శ్రమిస్తారని ఆశిస్తున్నాం’ అని పంజాబ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
TG: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆమెకు అందించారు. జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తన ప్రదర్శనల ద్వారా రాష్ట్రం, దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చినందుకు ఆమెకు ఈ ఉద్యోగం ఇచ్చారు. డీఎస్పీ ర్యాంకులోకి నేరుగా ప్రవేశం కల్పించారు.
AP: విశాఖ రైల్వే జోన్‌కు YCP ఐదేళ్ల పాలనలో భూమి ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘కేంద్ర పథకాలను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడు’ అని బాబు విమర్శించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దేవర మూవీ టీమ్ షాక్ ఇచ్చింది. చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఆయుధ పూజ సాంగ్‌ను రేపు రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ‘ఆయుధ పూజ అనేది సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఓ మ్యాడ్‌నెస్. రేపు రిలీజ్ చేయడం లేదు. కానీ మీరు ఎదురుచూస్తున్న ‘హై’ని కచ్చితంగా ఇస్తాం’ అని ట్వీట్ చేసింది. దీంతో తారక్ ఫ్యాన్స్ నుంచి నిరాశ వ్యక్తమవుతోంది.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్‌ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
APలో గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు అన్నారు. ‘2047 నాటికి APలో పేదరికం లేకుండా చేస్తాం. 3పార్టీలు సమగ్ర కృషితో ఘన విజయం సాధించాం. రాష్ట్రాభివృద్ధికి కలిశాం.. మన కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలు మెచ్చేలా మన పాలన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజలకు వివరించాలి. నియోజకవర్గాల్లో నేతలు విజన్‌తో ముందుకెళ్లాలి’ అని సూచించారు.
AP: తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ‘నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అన్నదానం కూడా సరిగ్గా నిర్వహించలేదు. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా పెంచుతాం’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.