India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

భార్యాబాధితుడు అతుల్ <<14841616>>సూసైడ్<<>> నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది! ‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’ అంటూ మగవాళ్లు నినదిస్తున్నారు. బెంగళూరులో అతడి భార్య నికిత పనిచేసే అసెంచర్ ఆఫీస్ ముందు వందలాది IT ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా అసెంచర్ ఆఫీసులు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు టెకీలు రావాలని పిలుపునిస్తూ అక్కడక్కడా పోస్టర్లు వెలిశాయి. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్లు పెరిగాయి.

TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.

దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.

విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, హైపర్ ఆది, నరేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గత నెల 22న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయిందని సినీ వర్గాల విశ్లేషణ.

శక్తిమాన్ సినిమా అంటూ వస్తే దానికి హీరోగా అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతారని ఒకప్పటి ‘శక్తిమాన్’ పాత్రధారి ముకేశ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. యూట్యూబ్‌లో ఆయన పుష్ప-2కి రివ్యూ ఇచ్చారు. ‘నేను ఆయన గత సినిమాలు చూడలేదు. ఈ సినిమా చూశాక అవి కూడా చూడాలనిపిస్తోంది. సినిమాని డబ్బుతో కాదు ప్లానింగ్‌తో తీయాలి. ఆ ప్లానింగ్ పుష్పలో స్పష్టంగా కనిపిస్తోంది. హీరో చట్టవిరుద్ధంగా ఉండటమే నాకు నచ్చలేదు’ అని పేర్కొన్నారు.

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజుపై AP CM చంద్రబాబు చేసిన ట్వీట్‌ను తమిళులు ఖండిస్తున్నారు. గుకేశ్ తెలుగు వ్యక్తి అని అనడం సరికాదని, గుకేశ్ తమిళుడని కామెంట్స్ చేస్తున్నారు. వారికి కౌంటర్‌గా ఆయన వికీపీడియాను షేర్ చేస్తూ మావాడేనని తెలుగు వాళ్లు అంటున్నారు. దీంతో CBN ట్వీట్ కింద తమిళ-తెలుగు నెటిజన్ల మాటల యుద్ధం జరుగుతోంది. కాగా గుకేశ్ చెన్నైకి చెందిన తెలుగువారని చాలా సైట్లు చెబుతున్నాయి.

సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్ల మేర పతనమవ్వడంతో రూ.5లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడమే ప్రధాన కారణం. ట్రంప్ గెలిచాక డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. కట్టడికి RBI ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. మరోవైపు చైనా ఉద్దీపనా పథకంలో స్పష్టత లేక మెటల్ షేర్లు కుప్పకూలాయి. ద్రవ్యోల్బణం, ఎకానమీ స్లోడౌన్, FIIల సెల్లింగ్ దెబ్బకొట్టాయి.

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు నిన్న ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు లాయర్ ధర్మాసనానికి వివరించారు. అయితే సీబీఐ స్టేటస్ రిపోర్ట్ కాపీని పరిశీలిస్తామని కోర్టు తెలపగా తామూ పరిశీలిస్తామని, అందుకు సమయం కావాలని జగన్ తరఫు లాయర్ కోరారు. దీంతో విచారణను జనవరి 10కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

అమెరికా, కెనడా, ఐరోపా దేశాలకు ప్రయాణించొద్దని రష్యా తమ పౌరులకు తాజాగా సూచించింది. ఆ దేశాలతో బంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల నుంచి వేధింపులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. ‘అనధికారికంగా ఆ దేశాలకు వెళ్లే వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అమెరికా, దాని మిత్రదేశాల్లో పర్యటించకండి’ అని స్పష్టం చేసింది. అటు అమెరికా సైతం రష్యాలో పర్యటించొద్దని తమ పౌరులకు చెప్పడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.