News June 7, 2024

DEECET నోటిఫికేషన్ విడుదల

image

TG: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల కోర్సు(2024-26)లో చేరేందుకు ప్రవేశ పరీక్ష DEECET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఈనెల 30 వరకు <>deecet.cdse<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్ జులై 10న జరగనుంది.

News June 7, 2024

అవినీతి ఆరోపణలతో కర్ణాటక మంత్రి రాజీనామా

image

మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం సిద్దరామయ్యకు సమర్పించగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు. నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ శాఖ మంత్రి బి.నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి.

News June 7, 2024

పరువు నష్టం కేసు.. రాహుల్‌కు బెయిల్

image

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని ఆయనపై ఆ పార్టీ నేతలు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టు తాజాగా రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

News June 7, 2024

జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఎవరు?

image

AP: NDAలో భాగస్వామ్యం ఉన్న జనసేనకు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీలుగా గెలవగా, సీనియర్ అయిన బాలశౌరి పేరును జనసేనాని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. రాజమండ్రి నుంచి గెలిచిన పురందీశ్వరి, అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేశ్ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలించనుంది.

News June 7, 2024

ఇరానీ TO రాజీవ్.. ఓడిన 13మంది కేంద్రమంత్రులు వీరే..

image

2024లో NDA కూటమికి చెందిన మంత్రుల్లో 13మంది ఓడిపోయారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ, ఎలక్ట్రానిక్స్&ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా వంటి ప్రముఖులతో పాటు రావ్ సాహెబ్ దాన్వే, నాథ్ పాండే, సుభాష్ సర్కార్, కైలాశ్ చౌదరి, నిషిత్ ప్రమాణిక్, L మురుగన్, సంజీవ్ బల్యాన్, కపిల్ పాటిల్, భారతీ పవార్ వంటి మంత్రులు ఓడిపోయారు.

News June 7, 2024

టీడీపీ నుంచి ముగ్గురు.. మిగతా పార్టీల నుంచి 0

image

AP అసెంబ్లీలో ముగ్గురు మైనార్టీ MLAలు మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నసీర్ అహ్మద్, నంద్యాల నుంచి మహమ్మద్ ఫరూక్, మదనపల్లె నుంచి షాజహాన్ బాషా TDP టికెట్లపై గెలుపొందారు. ముగ్గురిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. అటు జనసేన, బీజేపీ నుంచి మైనార్టీలెవరికీ టికెట్లు కేటాయించలేదు. వైసీపీ టికెట్లు కేటాయించిన మైనార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి చెందారు.

News June 7, 2024

BREAKING: వడ్డీ రేట్లు యథాతథం

image

రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వడ్డీరేటు 6.5శాతంగా ఉంది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడాదిగా వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతోంది.

News June 7, 2024

KCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!

image

కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం చేపట్టబోతోంది.

News June 7, 2024

శివరాజ్‌ సింగ్‌కు BJP అధ్యక్ష బాధ్యతలు?

image

మధ్యప్రదేశ్ మాజీ CM శివరాజ్ సింగ్ చౌహాన్‌కు BJP జాతీయ అధ్యక్ష బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ జేపీ నడ్డా నుంచి ఆయన పగ్గాలు అందుకోనున్నారట. ఇప్పటికే ఆయనకు ఢిల్లీ కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చిందట. ఆయన ఆరుసార్లు ఎంపీగా, 16ఏళ్లు సీఎంగా పని చేశారు. ఇటీవల MP అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలిచినా ఆయనకు CM పదవి ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన చౌహాన్‌ వర్గం తాజా వార్తతో ఖుషీ అవుతోంది.

News June 7, 2024

ICICI బ్యాంక్‌‌కు SEBI మందలింపు

image

ICICI సెక్యూరిటీస్ షేర్‌హోల్డర్‌లు డీలిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేసేలా ICICI బ్యాంకు ప్రయత్నించిందని SEBI మందలించింది. ICICI స్పందిస్తూ లావాదేవీల నిజానిజాలను మాత్రమే ఉద్యోగుల ద్వారా వాటాదార్లకు తెలియచేశామని సమాధానమిచ్చింది. దీనికి ప్రతిస్పందించిన SEBI లావాదేవీల్లో ICICI బ్యాంక్‌ కూడా ఒక భాగమని, వాటాదార్లను అలా సంప్రదించడం సరికాదంది. బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలంది.