India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని <<14855229>>వీడిన<<>> విషయం తెలిసిందే.

దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.

AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ అరెస్టయ్యారు.

తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను ఇంకా గర్భం దాల్చలేదని తెలిపారు. బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె మండిపడ్డారు. తమకు పెళ్లై నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. కాగా గత జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాను నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చివరి వరకు తనకు తెలియదని హీరోయిన్ రష్మిక తెలిపారు. కానీ తనకు అది ప్రత్యేకమని ఆమె చెప్పారు. ‘నాకు హీరోలందరితోనూ స్నేహం ఉంది. సల్మాన్ సెట్‌లో ఉంటే షూటింగ్ సరదాగా సాగుతుంది. ఓసారి నేను సెట్‌లో అనారోగ్యానికి గురైతే మంచి ఫుడ్ తెప్పించారు. ఆయన నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దళపతి విజయ్ అంటే కూడా ఎంతో ఇష్టం’ అని ఆమె పేర్కొన్నారు.

మొబీక్విక్ IPO అదరగొడుతోంది. రెండోరోజు 12PMకే 10X స్పందన లభించింది. ఇష్యూ ధర రూ.279తో పోలిస్తే GMP 53% ఎక్కువగా ఉంది. ఇన్‌స్టిట్యూషనల్స్ ఎక్కువగా ఎగబడుతున్నారు. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, రేటింగ్ సంస్థల రేటింగ్స్, 161 మిలియన్ల యూజర్ బేస్, డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంటు, దేశంలోని 99% పిన్‌కోడ్స్ పరిధిలో సేవలందిస్తుండటం ప్లస్‌పాయింట్స్. DEC 18న షేర్లు NSE, BSEలో లిస్ట్ అవ్వనున్నాయి.

AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుమీదున్నాయి. ఇవాళ ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.27వేల కోట్ల మేర పెరిగింది. రాజస్థాన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 250MW సోలార్ పవర్ ప్రాజెక్టును ఆరంభించింది. కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 11,434MWకు పెరగడంతో ఈ షేర్లు 7.1% లాభపడి రూ.1229 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ 5.6, ఎనర్జీ సొల్యూషన్స్ 3, టోటల్ గ్యాస్ 2.3, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.7, NDTV 1.7% మేర ఎగిశాయి.

మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ ఏడుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు.
Sorry, no posts matched your criteria.