India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీ20 వరల్డ్ కప్‌లో విఫలమవుతున్నారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే క్యాచ్ ఔటై గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరారు. గత 10 టీ20ల్లో ఆయనకిది ఐదో డకౌట్ కావడం విశేషం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యారు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులే చేశారు. ఇందులో నాలుగు డకౌట్లు కూడా ఉన్నాయి.
ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ‘మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఎన్డీఏలో ఉన్నా మోదీలా కాకుండా సెక్యులర్ నాయకులగానే ఉంటారని నమ్ముతున్నా. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలి. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
ఎంపీ కంగనా రనౌత్‌ను చెంప <<13392690>>దెబ్బ<<>> కొట్టిన ఘటనకు గతంలో రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. CAA బిల్లుతో పౌరసత్వం పోతుందని రక్తపాతం సృష్టించేందుకు టెర్రరిస్టులు రైతులుగా చెలామణి అవుతున్నారని గతంలో ఆమె ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించేది వారేనని ఆరోపించారు. ఆ తర్వాత తాను రైతులను టెర్రరిస్టులు అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
TG: బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఓటమిని ఒప్పుకున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ <<13392485>>ఎమ్మెల్సీ<<>> అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నేతలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో మాదిరి గోల్‌మాల్ చేసి గెలవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రతీ ఎంపీ నెలకు రూ.1 లక్ష జీతం పొందుతారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే రోజుకు రూ.2 వేల చొప్పున అలవెన్స్ అందుతుంది. అలాగే రూ.70 వేల నియోజకవర్గ అలవెన్సు, మరో రూ.60 వేలు ఆఫీసు ఖర్చుల కింద నెలనెలా చెల్లిస్తారు. దీంతో ప్రతీ ఎంపీకి నెలకు రూ.2.30 లక్షల మేర లభిస్తుంది. ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తారు. ఎంపీ, ఆయన భార్యకు ఏటా 34సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఫ్రీ జర్నీ ఉంటుంది.
అయోధ్యలో ఓటమికి BJP చేసిన తప్పులు కూడా ఓ కారణం. టెంపుల్ సిటీ అభివృద్ధి కోసమని స్థలాలను తీసుకున్న ప్రభుత్వం నష్టపోయినవారికి పరిహారం ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణం వల్ల వ్యాపారవేత్తలు, స్థానికేతరులే లాభపడ్డారని కోపంగా ఉన్న లోకల్స్ ఓటు రూపంలో నిరసన తెలిపారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ MP లల్లూ సింగ్‌పై వ్యతిరేకత, INC ఓటు బ్యాంకు కూడా SPకి కలిసొచ్చింది.
రామమందిర నిర్మాణంతో అయోధ్య దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓటమి చర్చనీయాంశమైంది. ఇక్కడ తమ అభ్యర్థి <<13388012>>అవధేష్<<>> గెలుపు కోసం SP అధినేత అఖిలేశ్ యాదవ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. 22 శాతం OBC(యాదవులు, కుర్మీలు)లు, దళితులు(21%), ముస్లిం(18%)లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవనే అంశాన్ని బలంగా తీసుకెళ్లారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నియోజకవర్గం, విజయం సాధించిన అభ్యర్థి, పార్టీ వివరాలను అందులో పొందుపర్చింది. కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.
AP: ఈవీఎంలపై అనుమానాలున్నాయని, పరిశీలన చేయాలని వైసీపీ నేతలు పార్టీ అధినేత జగన్‌కు సూచించారు. ఎన్నికల తీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఈసీతో కుమ్మక్కవ్వడంతోనే సీట్లు తగ్గాయని నేతలు ఆరోపించారు. మరోవైపు పార్టీ శ్రేణులకు అండగా నిలబడాలని జగన్ నేతలను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని YCP సెంట్రల్ ఆఫీసుగా మార్చాలని నిర్ణయించారు.
ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ట్రోలింగ్‌కు గురైన హార్దిక్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్ (4-1-27-3) వేసిన అతడు మంచి లయ మీద కనిపించారు. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ సమయంలో ఎగతాళి చేసిన వారే ‘మీరు మారారు సార్’ అంటూ ప్రశంసిస్తున్నారు. హార్దిక్.. టోర్నీ మొత్తం ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదని పోస్టులు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.