India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాత్రి పనివేళల నుంచి మహిళా డాక్టర్లకు విముక్తి కల్పించవచ్చనే బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మహిళలకు మినహాయింపులు అవసరం లేదని, వారికి సమాన అవకాశాలు కల్పించాని సీజే బెంచ్ అభిప్రాయపడింది. మహిళా వైద్యులకు పురుషులతో సమానంగా పని చేసేందుకు అనుమతించాలని ఆదేశించింది.
AP: తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లిక్కర్ పాలసీపై క్యాబినెట్ సబ్‌కమిటీ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో చాలామంది గంజాయికి ఎడిక్ట్ అయ్యారు. నాసిరకం మందుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని కొల్లు మండిపడ్డారు. కొత్తగా ప్రీమియం ఔట్‌లెట్స్ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.
బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్‌కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.
కెనరా రొబెకో కన్జూమర్ ట్రెండ్స్ ఫండ్ ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించింది. ఏటా 18.64% రిటర్న్ ఇచ్చింది. 2009, సెప్టెంబర్లో మొదలైన ఈ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేసిన వారికి ఇప్పుడు రూ.84.81 లక్షలు చేతికందాయి. అంటే 15 ఏళ్లలో విడతల వారీగా పెట్టిన రూ.18 లక్షలకు రూ.66.81 లక్షల లాభం వచ్చిందన్నమాట. పదేళ్ల క్రితం ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుంటే రూ.34.52 లక్షలు అందేవి. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే.
AP: ప్రభుత్వ స్కూళ్లలో ‘CBSE రద్దు’ ప్రచారంపై TDP స్పందించింది. ‘CBSE విధానం, అసెస్మెంట్‌కు విద్యార్థులు, టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ 1000 స్కూళ్లలో CBSE ఎగ్జామ్స్ మొదలెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక CBSE అసెస్మెంట్ ప్రకారం పరీక్షలు పెడితే, 64%మంది ఫెయిలయ్యారు. అందుకే ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసే వెసులుబాటును ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచే CBSE ఉంటుంది’ అని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ప్రైవేట్ కట్టడాలపై అనధికారిక బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్ పాత్‌లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది.
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కుదరడం వెనుక CM ఎలెక్ట్ ఆతిశీది కీలకపాత్ర. గతంలో విద్యాశాఖ మంత్రికి సలహాదారుగా, ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా ఉన్న ఆమె పాఠశాలల్లో మెరుగైన వసతులు, విద్యార్థుల సమ్మిళిత వికాసానికి డిజిటల్ తరగతులు, క్రీడలు, ఆంత్రప్రెన్యూరియల్ కరిక్యులమ్ ప్రవేశపెట్టారు. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తుండడం వెనుక ఆతిశీ కృషి ఎంతో ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
AP: కర్నూలు(D) తుగ్గలి(M) సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. అది 8 క్యారెట్ల వజ్రం అని తేల్చారు. పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.5లక్షలకు దానిని కొనుగోలు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని GSI గుర్తించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
నిమజ్జనమే చేయకుండా గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని భద్రపరుస్తున్నారనే విషయం మీకు తెలుసా? నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లికి దగ్గరలో ఉన్న పాలజ్(MH)లో కర్ర వినాయకుడిని పూజిస్తారు. ప్రతి ఏటా చవితికి బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరిరోజు వాగుకు తీసుకెళ్లి నీళ్లు చల్లి మళ్లీ భద్రపరుస్తారు.
Sorry, no posts matched your criteria.