India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘డిమోంటీ కాలనీ-2’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి జీ5లో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. 2015లో వచ్చిన తొలి పార్ట్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టులో WPI ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. జులైలోని 2.04 నుంచి 4 నెలల కనిష్ఠమైన 1.31 శాతానికి చేరింది. ఆహార ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నా తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే దీనికి కారణం. జులైలో 3.45% ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.11కి తగ్గింది. పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు కాస్త తగ్గితే ఆలు, పళ్లు, నూనెలు పెరిగాయి. ప్యాకేజీ ఫుడ్స్, బెవరేజెస్, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తుల ధరలు తగ్గాయని కామర్స్ మినిస్ట్రీ అంటోంది.
బుక్ మై షోలో ఇంట్రస్ట్‌ల విషయంలో పుష్ప-2ను ‘దేవర’ దాటేసింది. పుష్ప-2ను చూసేందుకు 334.6K మంది ఆసక్తి చూపిస్తుండగా, దేవర పార్ట్-1ను చూడటానికి ఆసక్తిగా ఉన్న వారి సంఖ్య 341.3Kకి పెరిగింది. దీంతో పుష్ప-2ను దేవర పార్ట్-1 అధిగమించింది. ఈనెల 27న దేవర విడుదలవుతుండగా, DEC 6న పుష్ప-2 రిలీజ్ కానుంది. అప్పటివరకు పుష్ప-2 చూడటానికి ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపుతారని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
AP: శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం పేరును రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మార్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు నూతన మద్యం పాలసీపై క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను మంత్రులు, అధికారులు సీఎంకు వివరిస్తున్నారు.
టీటీడీ పద్మావతి గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నేతలు చిందులు వేశారంటూ వైరలవుతోన్న వీడియోను AP FACTCHECK ఖండించింది. ‘తిరుమల అతిథి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 29న విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది. తిరుమల ప్రతిష్ఠ మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి’ అని పేర్కొంది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో CBI కీలక ఆధారాలు సేకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఘటన తీవ్రత దృష్ట్యా ఛార్జిషీట్ దాఖలుకు త్వరపడొద్దని సూచించింది. ‘CBI స్టేటస్ రిపోర్టులోని అంశాలు బయటపెడితే దర్యాప్తుకు అంతరాయం కలగొచ్చు. క్రైమ్‌సీన్, సాక్ష్యాల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు జరుగుతోంది. వారేం నిద్రపోవడం లేదు. నిజం కనుగొనేందుకు తగిన సమయమిచ్చాం. పోలీసులు వారికి సహకరించాల’ని పేర్కొంది.
ప్రముఖ టెలికం కంపెనీ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్ సరిగా రాకపోవడంతో కాల్స్ కలవడం లేదని యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ముంబైలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్‌లోనూ కాల్స్ కలుస్తున్నా వాయిస్ కట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
ఇంట్లో, కాలనీల్లో వెలసిన గణనాథుని విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న విగ్రహాలు మండపాలను విడిచిపెడుతుండటంతో ‘మళ్లీ రావయ్యా’ అంటూ భక్తులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇంట్లో నెలకొల్పిన ఏకదంతుడిని పంపించకుండా ఎమోషనల్ అవుతున్నారు. ఎన్నో రకాల రూపాలతో ఉన్న వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకుంటున్నాయి. బైబై గణేశా!
TG: కొంతకాలంగా తన ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న మాజీ CM, BRS అధినేత KCR సీఎం రేవంత్ కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. HYD పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులను పదేపదే బదిలీ చేయడం రేవంత్ అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తోందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. అటు కరోనా సమయంలోనూ కొనసాగించిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని ఆయన విమర్శించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.
సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 SEP 17న భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశారు. భారత్ తరఫునా ఇవే ఉత్తమ బౌలింగ్ గణాంకాలు. ఆసియా కప్-2023లో శ్రీలంకపై కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. సిరాజ్ దెబ్బకు 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు లంక ఆలౌట్ అయ్యింది. భారత్ 6.1 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకుంది. దీంతో 8వ ఆసియా కప్ టైటిల్‌ను టీమ్ ఇండియా తన ఖాతాలో వేసుకుంది.
Sorry, no posts matched your criteria.