News June 5, 2024

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన రామ్ చరణ్

image

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చంద్రబాబుకు అభినందనలు చెప్పారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుకి కంగ్రాట్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News June 5, 2024

లోక్‌సభ ఫలితాల్లో అత్యల్ప మెజార్టీ వీరికే

image

☛ రవీంద్ర దత్తారామ్ వైకర్ – శివసేన- ముంబై నార్త్ వెస్ట్- 48 ఓట్ల మెజార్టీ
☛ అదూర్ ప్రకాశ్- కాంగ్రెస్- అత్తింగళ్(కేరళ)- 684 ఓట్ల మెజార్టీ
☛ నారాయణ్ బెహరా- BJP-జయపురం(ఒడిశా) -1587 ఓట్ల మెజార్టీ
☛ అనిల్ చోప్రా-కాంగ్రెస్-జైపూర్-1615 ఓట్ల మెజార్టీ
☛ భోజ్‌రాజ్ నాగ్-BJP-కాంకేర్(ఛత్తీస్‌గఢ్)-1884 ఓట్ల మెజార్టీ

News June 5, 2024

అద్భుత విజయం అందించిన కిషన్ రెడ్డి

image

తెలంగాణలో BJP 8 MP సీట్లు దక్కడం వెనుక కిషన్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల మూణ్ణెళ్ల ముందు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టడంతో అప్పటికప్పుడు క్యాడర్, లీడర్లను సెట్ చేసుకుని అసెంబ్లీ పోరులో గెలవడం అసాధ్యం. ఇది ఢిల్లీ పెద్దలకూ తెలుసు, కానీ పార్లమెంటు టార్గెట్‌తో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అనుకున్నట్లే తన అనుభవం, చతురతతో ఆర్నెళ్లలోనే కాంగ్రెస్‌కు BJP ప్రత్యామ్నాయం అనేలా కిషన్ ఫలితం చూపారు.

News June 5, 2024

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రాజీనామా!

image

బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ప్రతికూల ఫలితాలు రావడంతో.. దానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. తన రాజీనామాకు అనుమతించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ప్రభుత్వంలో ఉండకుండా పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

News June 5, 2024

మారిన ప్రభుత్వం.. ఏపీ సచివాలయంలో పోలీసుల సోదాలు

image

ప్రభుత్వం మారడంతో ఏపీ సచివాలయంలో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించారు. సర్వర్లలోని డేటా డిలీట్ చేయడం లేదా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో తనిఖీలు చేపట్టారు. సిబ్బంది ల్యాప్‌టాప్‌లు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.

News June 5, 2024

టీడీపీకి ‘జలశక్తి’ మంత్రి పదవి.. తెలంగాణకు నష్టమా?

image

కేంద్ర ‘జలశక్తి’ మంత్రి పదవిని టీడీపీ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి వనరులు, కేటాయింపులపై తీవ్ర ప్రభావం పడొచ్చు. TG అసెంబ్లీ పోలింగ్ రోజు సాగర్‌ డ్యామ్‌ను AP అధీనంలోకి తీసుకుంది. దీంతో జలశక్తి పరిధిలోని KRMB రంగంలోకి దిగింది. సాగర్లో అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో TGకి 8.5, APకి 5.5 టీఎంసీల నీటిని ఏప్రిల్‌లో కేటాయించింది. ఇకపై వివాదాలు ముదిరితే ఏపీదే పైచేయి కావొచ్చు. మీరేమంటారు?

News June 5, 2024

ఒడిశా CM నవీన్ పట్నాయక్ రాజీనామా

image

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఒడిశా CM నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. 24 ఏళ్ల పాటు ఆయన CMగా కొనసాగారు. తాజా ఫలితాల్లో నవీన్ పార్టీ బిజూ జనతాదళ్(BJD) మొత్తం 147 స్థానాలకు గాను 51 స్థానాలకే పరిమితమైంది. BJP 78 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ 14, ఇతరులు 5 చోట్ల గెలిచారు. అటు 21 లోక్‌సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.

News June 5, 2024

వన్ వర్సెస్ ఆల్ : బీజేపీదే గోల్!

image

సొంత మెజార్టీ తగ్గింది కానీ ఇప్పటికీ దేశంలో BJPనే అతిపెద్ద పార్టీ. ఇండియా కూటమి మొత్తం కన్నా దానికొచ్చిన సీట్లే ఎక్కువ. కాంగ్రెస్ 99, SP 37, TMC 29, DMK 22 డబుల్ డిజిట్లు పొందాయి. ఉద్ధవ్ శివసేన, శరద్ NCP సహా చిన్నా చితక 16 పార్టీలకు సింగిల్ డిజిటే వచ్చింది. ఇక ఖాతా తెరవనివి 4. కూటమికి 234 వస్తే కమలానికి 240 వచ్చాయి. ఉచితాలతో విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీ కన్నా తక్కువేనని కొందరి వాదన. మీరేమంటారు?

News June 5, 2024

33% మేర పతనమైన రైల్వే స్టాక్స్

image

గత హయాంలో మోదీ ప్రభుత్వం రైల్వేపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఈ స్టాక్స్ రెండు రోజుల్లోనే 33% వరకు క్రాష్ అయ్యాయి. టిటాగఢ్ రైల్వే సిస్టమ్స్ 33, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 26, రైల్ టెల్ కార్ప్, IRCTC చెరో 19, RITES, IRFC, RVNL, టెక్స్‌మాకో, జూపిటర్ వ్యాగన్స్ షేర్లు 18-23% మేర క్షీణించాయి. NDA-3 ప్రభుత్వం స్థిరపడే దాక ఈ షేర్లలో కరెక్షన్ తప్పకపోవచ్చు.

News June 5, 2024

BREAKING: మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

image

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను ఆపద్ధర్మ పీఎంగా కొనసాగాలని కోరినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.