India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే తగ్గించేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల భర్తీకి NMC ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు NMC నిధులిస్తే వద్దన్న ఘనత చంద్రబాబుదే. మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య. విద్యార్థులకి ద్రోహం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
తమిళ హీరో విజయ్ తన చివరి సినిమా ‘దళపతి69’కి భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం ఏకంగా రూ.275 కోట్లు తీసుకుంటారని సమాచారం. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఓ మూవీకి అత్యధిక మొత్తం తీసుకోనున్న నటుడిగా నిలవనున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా రెమ్యూనరేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
సాధారణంగా చాలా మంది ఆటో డ్రైవర్లు తమ వాహనం వెనకాల చిత్ర విచిత్రమైన పోస్టర్లను అంటించుకుంటారు. అయితే ఈ డ్రైవర్ మాత్రం డిఫరెంట్. తన ఆటోపై అమ్మనాన్న ఫొటోను ఉంచుకొని వారి పట్ల ప్రేమను వెల్లడించారు. ఈ ఫొటోను ఓ నెటిజన్ షేర్ చేశారు. కని, పెంచిన వాళ్లను అనాథలుగా వదిలేస్తున్న ఈ సమాజంలో తల్లిదండ్రులపై ప్రేమను ఇలా వ్యక్తపరిచేవారు కూడా ఉంటారని రాసుకొచ్చారు.
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరోసారి అరెస్టయ్యారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఆయనతో పాటు తలా పోలీస్ స్టేషన్ SHO అభిజిత్ మండల్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీతో డాక్టర్ల బృందం చర్చల నడుమ ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పలు అంశాల్లో ఘోష్‌ను ప్రశ్నించిన సీబీఐ అతనిపై హత్యాచారం ఆరోపణలు మోపింది.
TG: సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రాజ్ కుమార్ రీల్స్ చేసేందుకు వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో నిలిపి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతడి శరీరం 70శాతం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
AP: నటుడు మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్, MB యూనివర్సిటీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న వేళ మంచు మనోజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘ప్రస్తుత పరిస్థితి బాధించింది. ఈ సమయంలో విద్యార్థులకు సపోర్ట్‌గా ఉంటా. నా తండ్రి మోహన్ బాబు విద్యార్థుల శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. ఫిర్యాదులను నా మెయిల్‌కు పంపండి. నా తండ్రి దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
TG: గణేశ్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిలపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. మొత్తం 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఉత్సవాల్లో మహిళల భద్రతపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు మహిళా పోలీస్ విభాగం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
Sorry, no posts matched your criteria.