India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రుణమాఫీపై BRS నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని Dy.CM భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ధర్మారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినవారికి గౌరవం ఇవ్వాలన్నారు. అందుకే రూ.18 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ <<14099367>>వ్యాఖ్యల<<>>కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చిగొట్టింది బీఆర్ఎస్ సభ్యులేనని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండే సెటిలర్లను విమర్శించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రాంతీయతను రాజకీయాల కోసం వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌లా నియంతృత్వ పోకడలకు తాము పోవడం లేదన్నారు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ నామమాత్రపు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో భారత్ 2-1 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి సెంటిమెంట్ అని MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ఆత్మాభిమానాలతో ముడిపడి ఉంది. ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కచ్చితంగా కాపాడుకుంటాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడం YCP వల్ల కాలేదు. పక్క రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల కోసం సీఎంలు స్వయంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రైవేటీకరణ యోచనను కేంద్రం మానుకుంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
పోలీస్ వ్యాన్‌లో వినాయక విగ్రహం ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటో మనసును కలిచివేస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. కర్ణాటకలోని మాండ్యలో హిందువులపై దాడిని నిరసిస్తూ బెంగళూరులో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే 40మంది ఆందోళనకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక విగ్రహాన్ని సైతం పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే కాసేపటికే దాన్ని పోలీసులు నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.
భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం వేర్వేరు డిజైన్‌లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్‌కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.
టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ఆయన మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ‘ఆయన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతారు. స్వేచ్ఛగా ఆడమని చెబుతారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే మీరు ప్రదర్శన చేయకపోయినా అండగా నిలిచి అవకాశాలిస్తారు. ఏ ఆటగాడికైనా అదే కావాలి. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే గౌతీ వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు’ అని వెల్లడించారు.
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువును డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారు, తమ డేటా వివరాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి. అడ్రస్, చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేసేందుకు ఇక్కడ <
Sorry, no posts matched your criteria.