India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మహిళలు సీక్రెట్ కెమెరాల బారిన పడకుండా ఉండేందుకు HYD పోలీసులు ‘యాంటీ రెడ్ ఐ’ టీమ్‌ను తీసుకొస్తున్నారు. స్టార్ హోటల్స్, లాడ్జీలు, షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్, పబ్స్, హాస్టల్స్, హాస్పిటల్స్‌లో ఎక్కడ సీక్రెట్ కెమెరాలున్నా ఈ టీమ్ వాటిని గుర్తిస్తుంది. ఇందుకోసం 2వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారు. వీరు షీ టీమ్స్‌తో కలిసి బగ్ డిటెక్టర్‌తో తనిఖీలు చేపడతారు.

పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలకు అందిస్తున్న రాయితీలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ‘కెనడాకు ఏటా $100B, మెక్సికోకు $300B సబ్సిడీ ఇస్తున్నాం. అసలు ఈ దేశాలకు ఎందుకు ఇవ్వాలి? దాని కంటే ఆ రెండు అమెరికాలో రాష్ట్రాలుగా విలీనమైతే మంచిది’ అని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే ఆ దేశాల దిగుమతులపై భారీ పన్నులు విధిస్తామని ఇటీవల ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.

TG: కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. పెండింగ్ హామీల అమలుకు కసరత్తు జరుగుతోందని మంత్రి వివరించారు. పదేళ్లలో BRS చేయని ఎన్నోపనులను కాంగ్రెస్ ఏడాదిలోనే చేసిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఆ జట్టు 64 మ్యాచుల్లో 32 గెలిచింది. రెండో స్థానంలో భారత జట్టు (53 మ్యాచుల్లో 31 విజయాలు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (48 మ్యాచుల్లో 29 విన్స్) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (18), సౌతాఫ్రికా (18), శ్రీలంక (12), పాకిస్థాన్ (12), వెస్టిండీస్ (9) ఉన్నాయి.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియాలో జపాన్, తైవాన్ మినహా అన్ని దేశాల సూచీలు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ 8 పాయింట్లే పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. సిరియా సంక్షోభం, ముడి చమురు ధరలు స్థిరంగానే ఉండటం, ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి, ధరలపై నిర్ణయం తీసుకోకపోవడం వంటివి గమనించాల్సిన అంశాలు. క్రితంవారం జోరు ప్రదర్శించిన నిఫ్టీ, సెన్సెక్స్ ఈవారం మిశ్రమంగా ఉండొచ్చు.

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,107 మంది దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు లభించింది.

AP: నంద్యాల(D) నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని లహరిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతడు కూడా నిప్పటించుకోగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతో యువతిపై యువకుడు దాడి చేసినట్లు సమాచారం.

TG: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలపై సమీక్షించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పుష్ప-2 నిర్మాతలకు మరో షాక్ తగిలింది. మూవీ విడుదలైన రోజే పలు ఆన్‌లైన్ సైట్లలో లీకవగా తాజాగా కొందరు యూట్యూబ్‌లో హిందీ వెర్షన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.

సిరియా అధ్యక్షుడు, డాక్టర్ బషర్ అల్ అసద్ దేశాన్ని వీడటంతో ఆ దేశం రెబల్స్ వశమైంది. ఈ పోరాటానికి 14 ఏళ్ల బాలిక తెగింపు ఆజ్యం పోసింది. అసద్ అరాచకాలను తట్టుకోలేక 2011లో ఆమె దారా అనే గ్రామంలోని గోడలపై ‘ఇక నీ వంతు డాక్టర్’ అని గ్రాఫిటీ చిత్రాలు వేసింది. దీంతో ఆ బాలిక, స్నేహితురాళ్లను పోలీసులు 26 రోజులు హింసించారు. ఈ క్రమంలో దారాలో మొదలైన తిరుగుబాటు దేశంలో అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనంతో ముగిసింది.
Sorry, no posts matched your criteria.