India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువుల FTL, బఫర్ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది.
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.
ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల ‘వెర్టికల్ లాంఛ్’ స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. తక్కువ ఎత్తులో తీవ్రవేగంతో ఎగిరే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించామని తెలిపింది. శత్రు విమానాలు, హెలీకాప్టర్లు, డ్రోన్ల వంటివాటిని ఈ క్షిపణులు నేలకూల్చగలవు.
‘దేవర’ రిలీజ్ టైమ్(ఈ నెల 27) సమీపిస్తుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివను యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యంగ్ టైగర్‌తో ఫ్యాన్ బాయ్స్ ఇంటర్వ్యూ అదిరిపోయి ఉంటుందని, దీని కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడానికి ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని తెలిపారు.
AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. తాజాగా పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు హార్ట్ అటాక్‌తో మృతి చెందిన ఘటన చిత్తూరు(D) వి.కోటలో జరిగింది. కర్ణాటక సరిహద్దు వెంగసంద్రంకు చెందిన కార్తీక్(28)కు రామకుప్పం(M) కొల్లుపల్లి వాసి భవానితో పెళ్లయ్యింది. ఇవాళ ఛాతీలో నొప్పి రావడంతో భార్యతో కలిసి ఆస్పత్రి వెళ్లగా, చికిత్స పొందుతూ మరణించాడు.
పాత ఐఫోన్, ఐప్యాడ్‌లకు తమ సపోర్ట్‌ను త్వరలో ఆపేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17 కంటే వెనుకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న యాపిల్ డివైజ్‌లకు అప్‌డేట్స్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఐఫోన్ 8, 8 ప్లస్, ఎక్స్, ఐప్యాడ్ ప్రో, 5వ తరం ఐప్యాడ్ పరికరాలపై ఈ నిర్ణయం ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలవుతుందన్నదానిపై నెట్‌ఫ్లిక్స్ తుది తేదీని ఇంకా ప్రకటించలేదు.
TG: భారీ వర్షాలు, వరదలకు రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి CM రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్లు దెబ్బతినడంతో 7,693 కోట్లు, అర్బన్ డెవలప్‌మెంట్-రూ.1216 కోట్లు, ఇరిగేషన్-రూ.483 కోట్లు, తాగునీటి పథకం-రూ.331 కోట్లు, వ్యవసాయం-రూ.231 కోట్లు, విద్యుత్-రూ.179 కోట్లు, మత్స్యశాఖకు రూ.56 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు.
రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతికి చెందిన ఓ నిరుద్యోగి కష్టాల చుట్టూ సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఇంద్రజ, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.
1984 విమాన హైజాక్ ఘటనపై ‘IC-814’ మూవీ వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘హైజాకర్లతో సంప్రదింపులు జరిపిన బృందంలో నేనూ సభ్యుడిని. కొన్నిగంటల తర్వాత విమానంలో నా తండ్రి కూడా ఉన్నారని తెలిసింది. అది నాకు చాలా భిన్నమైన అనుభవం. ఓవైపు ప్రభుత్వం తరఫున జవాబుదారీతనం, మరోవైపు గవర్నమెంట్‌పై ఒత్తిడి తెచ్చిన బాధిత కుటుంబంలో సభ్యుడిగా ఉండాల్సి వచ్చింది’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.