News May 28, 2024

ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం పనిచేస్తాం: మోదీ

image

సీనియర్ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ‘తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయన కలలు కన్న సమాజం కోసం నిరంతరం పని చేస్తాం’ అని ట్వీట్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఆయన తీసుకొచ్చిన పథకాలను గుర్తుచేసుకున్నారు.

News May 28, 2024

అగ్నివీర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

భారత ఆర్మీ అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(CEE 2024) ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22-మే 3 వరకు CBT విధానంలో నిర్వహించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అర్హత పొందుతారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి

News May 28, 2024

రెస్టారెంట్లు.. పైన పటారం లోన లొటారం!!

image

TG: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో రెస్టారెంట్లలో ఆహారం ఎలా తయారుచేస్తారో బట్టబయలు అవుతోంది. రామేశ్వరం కేఫ్, రాయలసీమ రుచులు లాంటి ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు సైతం ఎక్స్‌పైరీ అయిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయి. HYDతో పాటు ఇతర పట్టణాల్లోనూ అధికారులు తనిఖీలు పెంచారు. జరిమానా వేసి వదిలేయకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News May 28, 2024

రేపు భారతీయుడు-2 సెకండ్ సింగిల్

image

శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఇవాళ సా.5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.

News May 28, 2024

బెంగాల్‌లో మనుగడ కోసం టీఎంసీ పోరాటం: మోదీ

image

లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి ఈ సారి అత్యధిక సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. టీఎంసీ మనుగడ కోసం పోరాడుతోందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. బీజేపీకి 80 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున కాషాయపార్టీకి మద్దతుగా నిలుస్తారన్నారు.

News May 28, 2024

BREAKING: పిన్నెల్లికి ఊరట

image

AP: మాచర్ల వైసీపీ MLA అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో న్యాయస్థానం ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అటు కొద్ది రోజుల క్రితం ఈవీఎం ధ్వంసం కేసులోనూ పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

News May 28, 2024

‘పుష్ప-2’ సెకండ్ సింగిల్ స్పెషల్ పోస్టర్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2 నుంచి సెకండ్ సింగిల్‌ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇండియాలోనే మోస్ట్ ఫేవరెట్ జోడీ పుష్ప రాజ్& శ్రీవల్లి అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. రేపు ఉదయం 11.07 గంటలకు సాంగ్ రిలీజ్ కానుంది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే సాంగ్‌ను శ్రేయా ఘోషల్ పాడారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఆమే పాడారు.

News May 28, 2024

ఒడిశా సంక్షేమం కోసం CM నవీన్‌తో రిలేషన్‌ను త్యాగం చేశా: మోదీ

image

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు. ఒడిశా సంక్షేమం కోసమే CM నవీన్ పట్నాయక్‌తో రిలేషన్‌ను త్యాగం చేశానని చెప్పారు. ఎన్నికల తర్వాత తనకు ఎవరితోనూ విరోధం లేదనే విషయాన్ని చెప్పి అందరినీ ఒప్పిస్తానన్నారు. ఒడిశాలో BJDతో బంధాన్ని తెంచుకుని బీజేపీ ఈసారి సొంతంగా బరిలో దిగిన విషయం తెలిసిందే.

News May 28, 2024

చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా

image

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో అక్కడి ప్రభుత్వం ఈ వీసా అందిస్తుంది. ఇంతకుముందు సినీ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్, షారుఖ్, అల్లు అర్జున్, అమలాపాల్, త్రిష, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి తదితరులకు గోల్డెన్ వీసా లభించింది.

News May 28, 2024

NTR పథకాల్లో మీకు నచ్చిందేది?

image

నందమూరి తారక రామారావు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రూ.2కే కేజీ బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులు, కూలీలకు పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల ఏర్పాటు, ప్రజల వద్దకే పాలన లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. మరి NTR పథకాల్లో మీకు నచ్చిందేదో కామెంట్ చేయండి.