India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో <<13316860>>అవార్డు<<>> గెలుచుకున్న దర్శకురాలు పాయల్ కపాడియాను ప్రధాని మోదీ అభినందించారు. ఆమె విజయం పట్ల భారత్ ఎంతో గర్విస్తోందని ట్వీట్ చేశారు. ఈ విజయం భావితరాల వారికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కపాడియాకు రాహుల్ గాంధీ, అనురాగ్ ఠాకూర్ కూడా Xలో అభినందనలు తెలియజేశారు. మరోవైపు కేన్స్ వేదికపై నిలబడటం ప్రత్యేకమని అవార్డు గెలుచుకున్న అనంతరం కపాడియా తెలిపారు.
TG: గత ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1700 ఇస్తే, తాము రూ.2007 చెల్లిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే BRS, BJP మాత్రం కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. BJP పాలిత రాష్ట్రాల్లోనూ తాలు, తరుగు తీస్తున్నారని ప్రెస్‌మీట్‌లో చెప్పారు.
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14,000 పరుగులతోపాటు 700 వికెట్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించారు. యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. కాగా ఇప్పటివరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటిని సాధించిన ఒకే ఒక్క ప్లేయర్‌గా షకీబ్ నిలిచారు.
చైనా విషయంలో తైవాన్ దూకుడును తగ్గించింది. ఆ దేశ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్-తె ఇటీవల చేసిన ప్రసంగంలో చైనాపై విరుచుకుపడ్డారు. దీంతో తైవాన్ చుట్టూ బీజింగ్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈక్రమంలోనే లాయ్ ఇప్పుడు మెత్తబడ్డారు. ‘మాకు ప్రాంతీయ స్థిరత్వం కీలకం. అందుకోసం చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి రావాలి’ అని కోరారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలోనూ తమదే అధికారమని పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 24-30, ఒడిశా, ఏపీలో 17 సీట్ల చొప్పున గెలుస్తామని తెలిపారు. కర్ణాటక, ఏపీలో ఓబీసీ కోటా కింద కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని దుయ్యబట్టారు. ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ సంరక్షిస్తుందని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్-2024కు ముందు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయపడ్డారు. గజ్జల్లో గాయం కారణంగా అతడు ఈనెల 28న జరగనున్న ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్‌లో పాల్గొనడం లేదు. జులై 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. సరిగ్గా 2 నెలల సమయమే ఉండటంతో అప్పటివరకు నీరజ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ బలపడుతోంది. ఈ అర్ధరాత్రికి బంగ్లాదేశ్ కేపుపారా-బెంగాల్ సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటనున్నట్లు IMD ప్రకటించింది. ఫలితంగా ఆ రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. సుమారు గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. రేపు ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు.
ఇవాళ చెన్నై వేదికగా SRH, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్‌కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు BCCI అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు తలో రూ.15 లక్షలు, ‘ఎమర్జింగ్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్’కు రూ.20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌కు రూ.12 లక్షలు దక్కనున్నాయి.
పపువా న్యూగినియాలో భారీగా కొండచరియలు విరిగి పడిన ఘటనలో మరణాల సంఖ్య 670 దాటినట్లు యూఎన్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. వెయ్యి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు తేజం పీవీ సింధుకు మలేషియా మాస్టర్స్ ఫైనల్స్‌లో నిరాశే ఎదురైంది. ఇవాళ చైనా ప్లేయర్ వాంగ్ ఝీ యీతో జరిగిన మ్యాచులో 21-16, 5-21, 16-21 పాయింట్ల తేడాతో ఓడారు. చివరి సెట్లో ముందు లీడింగ్‌లో కొనసాగినప్పటికీ చివర్లో వెనకబడ్డారు. దీంతో పరాజయం తప్పలేదు. 2022 సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత సింధు మేజర్ టోర్నీని గెలవకపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.