India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ ఘోర ఓటమిపాలైంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్సులో 140 స్కోరుకే ఆలౌటైంది. జడేజా(54) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. సైమన్ 6, కేశవ్ 2, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీశారు. దీంతో సఫారీలు 408 రన్స్ తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు.
స్కోర్లు: SA.. 489/10, 260/5(డిక్లేర్డ్), IND.. 201/10, 140/10

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.

<

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో అతడిని ఆమె అన్‌ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.

దేశ రాజధాని <<18386999>>ఢిల్లీ<<>>లో గాలి కాలుష్యం గర్భిణులు, నవజాత శిశువులకు హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. PM2.5 కణాలు రక్తంలోకి చేరి గర్భంలోని శిశువు మెదడు పెరుగుదలపై ప్రభావం చూపి ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. గాలి కాలుష్యం ఊపిరితిత్తులకు మాత్రమే హాని కాదని, శరీరంలోని నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. మెదడు పనితీరు తగ్గడంతోపాటు జ్ఞాపకశక్తి మందగిస్తుందని ఒక సర్వేలో తేలింది.
Sorry, no posts matched your criteria.