News May 24, 2024

ఓటుకు రూ.5,000.. ముగ్గురు టీచర్ల సస్పెండ్

image

AP: ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5,000 తీసుకున్న కేసులో ముగ్గురు టీచర్లను కలెక్టర్ దినేశ్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. కాగా ఇటీవల ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5,000 తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్సై ఖాజాబాబును ఐజీ <<13278620>>సస్పెండ్<<>> చేసిన విషయం తెలిసిందే.

News May 24, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. ఇది రేపు తుఫానుగా మారే అవకాశముందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ELR, NTR, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలోని ఉమ్మడి NZB, KRNR, WGL, RR, MDK, MBNR జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News May 24, 2024

సంచలనం: బంగ్లా చిత్తు.. సిరీస్ అమెరికాదే

image

పొట్టి ఫార్మాట్‌లో యూఎస్ఏ మరోసారి సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై రెండో టీ20లోనూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ బంగ్లా 138 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో అమెరికా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ముంగిట ఈ విజయాలు యూఎస్‌ఏ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి.

News May 24, 2024

నేటి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

APలో టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలకు 1,61,877 మంది, <<13291696>>ఇంటర్<<>> రెండేళ్లకు కలిపి 4,67,938 మంది పరీక్షలు రాయనున్నారు. సప్లిమెంటరీ ఫీజు కట్టని టెన్త్ విద్యార్థులకూ పరీక్ష రాసే అవకాశం అధికారులు కల్పించారు. 1.61లక్షల మంది ఫెయిల్ కాగా ఫీజు 1.15 లక్షల మందే చెల్లించారు. పెండింగ్‌లో ఉన్న టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు నెలాఖరులోపు విడుదల చేయనున్నారు.

News May 24, 2024

LS ఎలక్షన్స్: రేపు 58 స్థానాల్లో పోలింగ్

image

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, రెండు UTల్లోని 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హరియాణా 10, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు/UTల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది.

News May 24, 2024

జూన్ 1న గ్రూప్-1 హాల్ టికెట్లు

image

TG: జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC వెల్లడించింది. ఈసారి భారీగా(4.03లక్షలు) దరఖాస్తులు రావడంతో OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉ.10:30 నుంచి మ.ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్‌లో సమస్య ఉంటే అభ్యర్థి ఫొటో, ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్ర తీసుకుంటారు.

News May 24, 2024

ఇకపై ఆన్‌లైన్‌లో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం

image

AP: ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్త విధానం తీసుకురానుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే దీన్ని ప్రారంభిస్తారు. ఒక్కో అధ్యాపకుడు తమకు పంపిన 50 ప్రశ్నపత్రాలను.. వారి కళాశాలల్లో CC కెమెరాల పర్యవేక్షణలో దిద్దాల్సి ఉంటుంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరితో ఒక్కో పేపర్ మూల్యాంకనం చేయిస్తారు. అత్యధిక మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారు.

News May 24, 2024

‘ఇంపాక్ట్’ లేకున్నా భారీ స్కోర్లు నమోదయ్యేవి: అశ్విన్

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ వల్లే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అనుకోవడానికి లేదని బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘ఈ రూల్ లేకపోయినా భారీ స్కోర్లు నమోదయ్యేవి. బ్యాటర్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. పిచ్‌లు ఎక్కడైనా సరే ప్రామాణికంగానే తయారు చేస్తారు. అందుకే బౌలర్లు సైతం బ్యాటింగ్‌ స్కిల్స్‌పై దృష్టి సారించాలి. అప్పుడే మనం అనుకునే దిశగా మ్యాచ్ సాగుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News May 24, 2024

లోక్‌సభ బరిలో 121 మంది నిరక్షరాస్యులు

image

దేశవ్యాప్తంగా లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 359 మంది ఐదో తరగతి వరకు, 647 మంది 8వ తరగతి వరకు, 1303 మంది 12వ తరగతి, 1502 మంది అభ్యర్థులు డిగ్రీ, 198 మంది అభ్యర్థులు డాక్టరేట్లు ఉన్నట్లు పేర్కొంది. పలువురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. కాగా మిగిలిన ఆరు, ఏడు దశల ఎన్నికలు మే 25, జూన్ 1 జరగనున్నాయి.

News May 24, 2024

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

image

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంపై రష్యా భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా, 16 మందికి గాయాలైనట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాది అతి కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. తమకు పాశ్చాత్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిట్టూర్చారు. రష్యా వైమానిక దాడుల్ని ఎదుర్కునేలా తగినన్ని రక్షణ వ్యవస్థల్ని అందించడం లేదని అన్నారు.