News May 21, 2024

ఇరాన్ అధ్యక్షుడి మరణంలో కుట్ర కోణం?

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పలు కుట్రకోణాలపై నెట్టింట విస్తృత చర్చ నడుస్తోంది. ఉపగ్రహం నుంచి అత్యాధునిక లేజర్ బీమ్ సహాయంతో హెలికాప్టర్‌ను కూల్చేసి ఉండొచ్చన్నది వాటిలో ఆసక్తికరమైన అంశం. ఇప్పటికే పలు దేశాలకు ఈ ఆయుధం ఉంది. దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ తన తదనంతరం తన కొడుకుని తీసుకొచ్చేందుకు అతడి పోటీదారుగా ఉన్న రైసీని తప్పించి ఉంటారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

News May 21, 2024

ఈనెల 29 నుంచే అనంత్& రాధిక వివాహ వేడుక

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ & రాధిక మర్చంట్‌ల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 29 నుంచి జూన్ 1వరకు జరిగే వివాహ వేడుకలో ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో మొబైల్ ఫోన్స్‌ వాడకం నిషేధించినట్లు తెలుస్తోంది. ఇటలీలో వివాహ వేడుక మొదలై స్విట్జర్లాండ్‌లో ముగియనుంది. ప్రీవెడ్డింగ్ వేడుకను రూ.వెయ్యి కోట్లతో అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే.

News May 21, 2024

SRH ఫస్ట్ బ్యాటింగ్

image

అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్వాలిఫయర్1లో SRH టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (C), రింకు, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
SRH: హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, భువనేశ్వర్, కమిన్స్(C), విజయ్‌కాంత్, నటరాజన్.
>> SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News May 21, 2024

జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు

image

ఇరాన్‌లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడి ఎన్నికకు ప్రభుత్వం నిర్ణయించిందని స్థానిక మీడియా తెలిపింది. కాగా ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు దేశంలోని ముగ్గురు అగ్రశ్రేణి అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

News May 21, 2024

సీఎం జగన్‌‌లా ప్రధాని ఓటు అడగలేకపోయారు: బొత్స

image

AP: ప్రశాంత్ కిశోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. ఆయనతో వన్ టైమ్ వ్యవహారం అనుకొని.. తర్వాత వదిలేసినట్లు చెప్పారు. ప్రశాంత్ అయినా.. ఐ-ప్యాక్ అయినా తాత్కాలికమేనని తెలిపారు. వైసీపీ శాశ్వతమని.. ఈ ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చూసి ఓటెయ్యాలని సీఎం జగన్‌లా ప్రధాని మోదీ కూడా ఓటు అడగలేకపోయారని అన్నారు.

News May 21, 2024

తిరుపతికి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి తిరుపతికి బయల్దేరారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమయ్యారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం అయ్యాక ఆయన తిరుపతికి వెళ్లడం ఇదే తొలిసారి.

News May 21, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.

News May 21, 2024

‘పిరమిడ్స్’ రాళ్లు అలా తరలించారట!

image

టన్నుల బరువుండే అసంఖ్యాక రాళ్లను వందల అడుగుల ఎత్తులో పేర్చి పిరమిడ్లను నిర్మించారు పురాతన ఈజిప్షియన్లు. అంతటి బరువైన రాళ్లను ఎలా తరలించారన్న మిస్టరీ వీడింది. ఒకప్పుడు నైలు నదీ పాయ ఒకటి పిరమిడ్ల నిర్మాణ ప్రాంతానికి దగ్గరగా ప్రవహించేదట. ఉపగ్రహ చిత్రాలు, సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు. ఆ పాయ ద్వారానే రాళ్లను అప్పటివారు తరలించారని, క్రమేపీ అది కనుమరుగైందని తెలిపారు.

News May 21, 2024

KALKI: ‘బుజ్జీతో భైరవా’.. RFCలో ఈవెంట్

image

ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తోన్న బుజ్జీని పరిచయం చేసేందుకు ‘కల్కి’ మేకర్స్ వేదికను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ‘కల్కి’ సినిమా కోసం తయారుచేసిన స్పెషల్ కారును రివీల్ చేస్తారు. ‘భైరవా, బుజ్జీని కలుసుకోండి’ అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ జూన్ 27న విడుదల కానుంది.

News May 21, 2024

మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్

image

TG: సీఎం పదవి కోసం తాను ఢిల్లీకి రూ.100కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని, త్వరలోనే మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని స్పష్టం చేశారు.