India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేటి నుంచి దేశవ్యాప్తంగా CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉ.10.30 నుంచి మ.1.30 గం. వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫాం తప్పనిసరి. మార్చి 18న టెన్త్, ఏప్రిల్ 4న 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.

*రోడ్లపై స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి
*ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు
*స్లోగా వెళ్లేవారు ఎడమవైపు వెళ్లాలి. కుడి వైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
*ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి లో క్వాలిటీ హెల్మెట్లు వాడతారు. వీటి వల్ల మన ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. అందుకే ISI మార్క్ ఉన్న క్వాలిటీ హెల్మెట్ వాడాలి.
*బైక్ నడుపుతూ సెల్ ఫోన్ వాడొద్దు.
*రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దు.

TG: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. TG చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్కు బాటలు వేసేలా శాఖను తీర్చిదిద్దాలన్నారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని సూచించారు.

దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు.

TG: DSC 2008 అభ్యర్థులను కాంట్రాక్టు SGT(సెకండరీ గ్రేడ్ టీచర్)లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HYD మినహా మిగిలిన జిల్లాల్లో 1,382 మందిని కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంటున్నట్లు తెలిపింది. వీరికి నెలకు రూ.31,040 చెల్లించనుంది. జిల్లాల వారీగా DEOలకు అభ్యర్థుల లిస్టును పంపినట్లు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించామన్నారు.

AP: వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారని టీడీపీ ట్వీట్ చేసింది. ‘వంశీ ఐదేళ్లలో మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా రూ.195 కోట్లు సంపాదించినట్లు విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ నివేదికలో పేర్కొంది. ఇది గాక మరెన్నో అక్రమ దందాలతో, బెదిరింపులతో రూ.1000 కోట్లకు పైనే సంపాదించాడని ప్రజలు చెబుతున్నారు’ అని పేర్కొంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్తో ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, మూవీ చేసేందుకు ఆలియా భట్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ తర్వాతే దీనిని తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపై ట్రాన్స్జెండర్లను సైన్యంలో చేరడానికి అనుమతించబోమని US ఆర్మీ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ట్రాన్స్ జెండర్లకు సంబంధించి కొత్త నియామకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.